జాతీయ వార్తలు

మరో వివాదంలో కర్నాటక సిఎం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 16: కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు భాగస్వామిగా ఉన్న ఓ కంపెనీకి నగరంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటుకు కాంట్రాక్ట్ ఇవ్వడం చినికి చినికి గాలివానగా మారుతుండడంతో ముఖ్యమంత్రి కుమారుడు శనివారం ఆ కంపెనీనుంచి రాజీనామా చేశారు. మాట్రిక్స్ ఇమేజింగ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కుమారుడు, డాక్టర్ అయిన యతీంద్ర సిద్దరామయ్య మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. యతీంద్ర స్నేహితుడికి చెందిన కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంలో ఔచిత్యాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించడం, అది ఒక రాజకీయ వివాదంగా మారుతుండడం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానవర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్న సమయంలో యతీంద్ర ఆ కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. కంపెనీనుంచి యతీంద్ర వైదొలిగతే బాగుంటుంటుందని తాను ముఖ్యమంత్రికి సలహా ఇచ్చినట్లు కర్నాటక వ్యవహారాల ఇన్‌చార్జి అయిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ శుక్రవారం బహిరంగంగానే చెప్పడం గమనార్హం.