జాతీయ వార్తలు

మాకూ న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12:జమ్ము కాశ్మీర్ మంచుమయ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న తమకు సరైన ఆహారం లభించడం లేదంటూ ఓ సైనికుడు ఇటీవల ఆరోపించిన నేపథ్యంలో..అనేక మంది ఇతర సైనికులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. ఈ రకమైన ఆరోపణలతో సామాజిక మీడియా వెల్లువెత్తుతోంది. సీనియర్లు తమను వేధిస్తున్నారంటూ ఓ బిఎస్‌ఎఫ్ కానిస్టేబుల్, మరో సిఆర్‌పిఎఫ్ జవాన్ తమ ఆవేదన వెళ్లగక్కారు. బిఎస్‌ఎఫ్ జవాను తేజ్‌బహదూర్ యాదవ్ వీడియో వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపడంతో పిఎమ్‌ఓ రంగంలోకి దిగింది. ఈ జవాను ఫిర్యాదుపైనా, అనంతరం తీసుకున్న చర్యల్ని వివరిస్తూ వాస్తవ నివేదికను అందించాలని హోం మంత్రిత్వ శాఖను కోరింది. తన బూట్లు పాలిష్ చేయడం సహా తన ఆదేశాల్ని పాటించ పోతే ఉద్యోగం నుంచి తీసేస్తాననంటూ తన సీనియర్ అధికారి బెదిరించాడంటూ లాన్స్ నాయక్ వైపి సింగ్ ఆరోపించారు. సైనికుల కంటే తాము అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నామని, వారితో సమానంగా జీతభత్యాలు కల్పించాలంటూ జీత్‌సింగ్ అనే మరో సైనికులు ఆరోపించాడు.