జాతీయ వార్తలు

30 మంది భారత సైనికులను చంపేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన లక్షిత దాడులకు(సర్జికల్ స్ట్రైక్స్)కు ప్రతీకారంగా తాము కూడా నియంత్రణ రేఖ దాటి వెళ్లి అఖ్నూర్ ఆర్మీ క్యాం ప్‌పై దాడి చేసి 30 మంది భారతీయ సైనికులను చంపేశామని జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సరుూద్ చెప్పుకొన్నాడు. ఈ మేరకు ఒక వీడియో టేప్‌ను సైతం విడుదల చేశాడు. అయితే అఖ్నూర్ ఆర్మీ క్యాంప్ వద్ద సైనికులెవరూ చనిపోలేదని, ముగ్గురు కార్మికులు మాత్రమే చనిపోయారని భారత సైన్యం స్పష్టం చేసింది.
ముంబయి దాడుల సూత్రధారి, పాక్ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు అయిన హఫీజ్ సరుూద్ బుధవారం ఒక సమావేశం నిర్వహించాడు. దానికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ ఒకటి బైట పడింది. ‘్భరత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ వట్టి బూటకం. రెండు రోజుల క్రితం నలుగురు యువకులు అధీన రేఖ దాటి జమ్మూలోని అఖ్నూర్ వద్ద ఉండే ఆర్మీ క్యాంప్‌లోకి చొరబడ్డారు.
క్యాంప్‌పై దాడి చేసి 30 మంది సైనికులను మట్టుబెట్టారు. ఆర్మీ క్యాంప్‌ను తగులబెట్టన వారు చిన్న గాయం కూడా లేకుండా క్షేమంగా తిరిగి వచ్చారు. సర్జికల్ దాడి అంటే అది..’ అని సరుూద్ వ్యాఖ్యానించాడు. దీనిపై స్పందించిన భారత ఆర్మీ అధికారులు ఆ రోజు అసలు ఏం జరిగిందో వివరణ ఇచ్చారు. నలుగురు ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ దళం (జిఆర్‌ఇఎఫ్) శిబిరంపై దాడి చేసి ముగ్గురు కార్మికులను హతమార్చారని వారు తెలిపారు.