జాతీయ వార్తలు

ఖాదీ క్యాలెండర్‌పై మోదీ బొమ్మా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: ఖాదీ గ్రామోద్యోగ్ కేలండర్, డైరీపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రం ముద్రించడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ సహా పలు సంస్థలు దీనిపై మండిపడుతుండగా పిఎంవో మాత్రం కొట్టిపారేసింది. అనవసర రాద్ధాంత చేయోద్దని సూచించింది.
ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్(కెవిఐసి)లోని ఓ వర్గం మాత్రం మోదీ బొమ్మ వేయడా న్ని తీవ్రంగా నిరసిస్తోంది. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం ముద్రించడంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదని అయితే ప్రధాని మోదీ బొమ్మ వేయడం సిగ్గుచేటని వారన్నారు. ఒక్క కెవిఐసినే కాదు మంగళయాన్ కూడా తన గొప్పతనమేనని ప్రధాని మోదీ భావిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
ఖాదీ ఉద్యమానికి పితామహుడైన గాంధీ చిత్రం స్థానంలో మోదీ బొమ్మ వేయడాన్ని రాహుల్ తన ట్విట్టర్‌లో ఆక్షేపించారు.‘ఖాదీ, గాంధీజీ భారత చరిత్రకు చిహ్నాలు. స్వావలంబన, పోరాటానికి రెంటినీ గుర్తుగా భావిస్తాం’అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాల స్పష్టం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం తొలగించడం దారుణమని ఆయన విమర్శించారు.‘చరఖా, గాంధీజీ బొమ్మలు తీసేసి మోదీ బాబు చిత్రం ముద్రిస్తారా? గాంధీజీ జాతిపిత మరి మోదీ ఏమిటీ?’అని పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ నిలదీశారు. 2017 కెవిఐసి క్యాలెండర్, డైరీపై ప్రధాని మోదీ బొమ్మ ముద్రించడాన్ని పిఎంవో సమర్ధించింది. దీనిపై చర్చ అనవసరమని ఎప్పుడూ గాంధీ చిత్రమే ముద్రించాలని ఏమీ లేదని పేర్కొంది. 1996, 2002, 2005, 2011, 2012, 2013, 2016 సంవత్సరాల క్యాలెండర్, డైరీలపై గాంధీ బొమ్మలేకుండానే ముద్రించారని పిఎంవో గుర్తుచేసింది.

చిత్రం..ఖాదీ గ్రామోద్యోగ్ కేలండర్, డైరీపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రం