జాతీయ వార్తలు

నన్నూ అరెస్టు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరాసత్, జనవరి 13:పెద్ద నోట్ల రద్దును నిరసిస్తున్న తమ పార్టీ ఎంపీలను అరెస్టు చేయడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.తనతో పాటు తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్యేలందరినీ అరెస్టు చేయాలని సిబిఐకి సవాలు విసిరారు. ఎలాంటి ఆధారం, కారణం లేకుండా తమ పార్టీ నేతలు సుదీప్ బందోపాధ్యాయలను అరెస్టు చేశారని గుర్తు చేసిన మమత ‘జైలులో ఎంత స్థలం ఉంటుంది..నన్ను, మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను అరెస్టు చేయండి’అంటూ సిబిఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతటి అన్యాయం జరిగినా ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి వీల్లేదని, ఎవరైనా ఆ పని చేస్తే సిబిఐ అరెస్టు చేస్తుందంటూ శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. అయినా, ఎవరూ బెదిరిపోకూడదని, పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దుపై కేవలం తాను మాత్రమే పోరాటం చేస్తున్నానని పేర్కొన్న మమత దీని కారణంగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఆకలి మంటలు చెలరేగితే అందుకు ప్రథాని మోదీదే బాధ్యత అవుతుందని అన్నారు. ఖాదీ కాలెండర్‌పై గాంధీకి బదులు మోదీ ఫొటో పెట్టడాన్ని ప్రశ్నించిన మమత కొన్నాళ్లు పోతే కరెన్సీపై కూడా మోదీ ఫొటో వచ్చేస్తుందని వ్యాఖ్యానించారు. వీటిని బట్టి చూస్తే అసలు దేశంలో ఏమి జరుగుతోందన్న ఆందోళన కలుగుతోందంటూ మమత ఆవేదన వ్యక్తం చేశారు.