జాతీయ వార్తలు

ఐదు దశాబ్దాలకు కొలిక్కివచ్చిన కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 15: కోర్టులో వ్యాజ్యం అంటేనే ఇప్పట్లో తెగదులే అనే భావన నెలకొని ఉంది. దశాబ్దం దాటిన కేసులు దేశంలో వేలల్లో ఉన్నాయి. అయితే అతి పురాతనమైన వ్యాజ్యాలలో ఒకటయిన ఒక ఆస్తుల కేసు సుమారు అయిదు దశాబ్దాల తరువాత ఎట్టకేలకు పరిష్కారమయింది. ఎవరి వాటా ఎంతో తేల్చిన ఢిల్లీలోని ఓ కోర్టు వాటికి అనుగుణంగా మూడు భవనాలను పరస్పర అంగీకారంతో విభజించుకోవాలని కక్షిదారులకు సూచించింది. నలుగురు కుటుంబ సభ్యులు, డిడిఎ కలిపి అయిదుగురు కక్షిదారులతో 1968లో మొదలయిన ఈ వ్యాజ్యంలో చివరకు కక్షిదారుల సంఖ్య 58కి పెరిగింది. సెంట్రల్ ఢిల్లీలో నివసిస్తున్న నలుగురు అన్నదమ్ములు తమ తండ్రి మరణానంతరం ఆయన నుంచి వారసత్వంగా సంక్రమించిన మూడు భవనాలను పంచి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగానే అసలు కక్షిదారులు మృతి చెందారు. దీంతో ఆస్తికి వారసులయిన వారి పిల్లలు ఈ కేసును కొనసాగించారు. వీరిలోనూ చాలా మంది చనిపోయారు. దీంతో అసలు కక్షిదారుల మనుమలు కేసులో కక్షిదారులుగా చేరారు. అదనపు జిల్లా జడ్జి కామిని లావు ఈ మూడు ఆస్తులను విభజించవచ్చని తీర్పు చెప్పారు. 1975 నవంబర్‌లో జారీ చేసిన ప్రాథమిక డిక్రీ ఆధారంగా వారసులంతా తమ వాటాల ప్రకారం పరస్పర ఆమోదయోగ్యంతో ఈ మూడు భవనాలను పంచుకోవడానికి ఆరు నెలల గడువు ఇచ్చారు. ఇలా చేసుకొని ఆరు నెలలలోగా కోర్టుకు వస్తే దాని ప్రకారం కోర్టు తుది డిక్రీని జారీ చేస్తుంది. రెండు భవనాలు కరోల్‌బాగ్‌లో, ఒక భవనం గుర్గావ్‌లో ఉంది. ఆస్తుల విలువను అంచనా వేయడంలో విఫలమైతే ఆ ఆస్తులున్న సర్కిళ్లలో నోటిఫై అయిన ధరల ప్రకారం చర్చించుకోవాలని కూడా కోర్టు సూచించింది. కొందరి వాటాలను మరికొందరు నగదు చెల్లించి కొనుగోలు చేసుకునే స్వేచ్ఛను కూడా కోర్టు ఇచ్చింది. ఈ రెండు పద్ధతుల్లోనూ ఆస్తులను విభజించుకోవడంలో కక్షిదారులు విఫలమైతే కోర్టు ఆదేశాలను అమలు చేయవలసిందిగా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీని తరువాత మూడు భవనాలను వేలం వేసి వచ్చిన మొత్తాన్ని వారసులందరికి వారి వాటాల ప్రకారం చెల్లించడం జరుగుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.