జాతీయ వార్తలు

నేడు కొత్త సిబిఐ చీఫ్ ఎంపిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 15: సిబిఐ చీఫ్‌ను నిర్ణయించడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం సమావేశం కానుంది. గత డిసెంబర్ 2న అనిల్ సిన్హా రిటైరయినప్పటినుంచి నెల రోజులకు పైగా సిబిఐ చీఫ్ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం గుజరాత్ కేడర్ ఐపిఎస్ అధికారి రాకేశ్ ఆస్తానా తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతున్నారు. సెలెక్ట్ కమిటీలో లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లేదా ఆయన నామినీ సభ్యులుగా ఉంటారు. కొత్త సిబిఐ డైరెక్టర్ పదవికి పరిశీలన కోసం అర్హులైన 45 మంది ఐపిఎస్ అధికారులతో ఒక జాబితాను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించడం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. కృష్ణ చౌదరి, అరుణా బహుగుణ, ఎస్‌సి మాథుర్ పేర్లు ఈ పదవికోసం బలంగా వినిపిస్తున్న వారిలో ఉన్నాయి.