జాతీయ వార్తలు

ఎన్డీటీవీ నుంచి వైదొలగిన బర్ఖా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 15: ఎన్డీటీవీ కన్సల్టెంట్ ఎడిటర్ బర్ఖాదత్ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 21 సంవత్సరాలుగా ఎన్డీటీవీలో పనిచేసిన బర్ఖాదత్ కొత్త అవకాశాలను వెతుక్కుంటూ, కొత్త ప్రాజెక్టుల్లో పనిచేయాలని భావిస్తున్నట్లు ఆమె తన రాజీనామా అనంతరం వెల్లడించారు. ఇటీవలే ఆమె వాషింగ్టన్‌పోస్ట్ ప్రపంచ అభిప్రాయ విభాగంలో కాలమిస్టుగా చేరారు. బర్ఖాదత్ రాజీనామాపై ఎన్డీటీవీ లాంఛనంగా తన వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. పద్మశ్రీ అవార్డును అందుకున్న బర్ఖా 1995లో తన కెరీర్‌ను ప్రారంభించారు. 2015లో ఎన్డీటీవీ గ్రూప్ ఎడిటర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆమె నిర్వహించిన బక్‌స్టాప్స్, వియ్ ద పీపుల్ ప్రజాదరణ పొందిన కార్యక్రమాలు.