జాతీయ వార్తలు

పెండింగ్‌లో 2.81 కోట్ల కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 15: దేశ వ్యాప్తంగా దిగువ స్థాయి కోర్టుల్లో దాదాపు 2.8 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ కోర్టుల్లో దాదాపు 5 వేల న్యాయధికారుల పోస్టులు ఖాళీగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు దిగువ స్థాయి కోర్టుల్లో మున్ముందు దాదాపు మరో 15 వేల మంది న్యాయమూర్తులను నియమించి సిబ్బంది సంఖ్యను కనీసం ఏడు రెట్లు పెంచాలని రెండు నివేదికలు సుప్రీం కోర్టుకు సూచించాయి. ఈ రెండు నివేదికల్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన సూచనలతోపాటు తీవ్రమైన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు విడుదల చేసింది. దిగువ స్థాయి కోర్టుల్లో ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితిని అధిగమించేందుకు రానున్న మూడేళ్లలో దాదాపు మరో 15 వేల మంది న్యాయమూర్తులను నియమించాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలు స్పష్టం చేశాయి. దేశ వ్యాప్తంగా జిల్లా కోర్టులు 2015 జులై 1వ తేదీ నుంచి 2016 జూన్ 30వ తేదీ మధ్య 1,89,04,222 కేసులను పరిష్కరించినప్పటికీ ఇంకా 2,81,25,066 కేసులు పెండింగ్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోందని, దిగువ స్థాయి కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని ఆ నివేదికలు వెల్లడించాయి. దిగువ స్థాయి కోర్టుల్లో 21,324 మంది న్యాయాధికారుల పోస్టులకు గాను 4,954 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఈ నివేదికలు వెల్లడించాయి.