జాతీయ వార్తలు

వయోవృద్ధుల విధానాన్ని సమీక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 15: సీనియర్ సిటిజన్లకోసం కొత్త జాతీయ విధానానికి ఆమోదం తెలపడానికి ముందు ఇప్పుడున్న జాతీయ విధానం అమలు, దాని ఫలితం ఎలా ఉన్నాయో ఏదయినా ఒక బయటి ఏజెన్సీ చేత అంచనా వేయించాలని ప్రధాన మంత్రి కార్యాలయం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖను కోరింది. 2007 నాటి తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల యోగక్షేమాలకు సంబంధించిన చట్టంపై తాజాగా ఒక స్థారుూ నివేదికను రూపొందించాలని కూడా పిఎంఓ ఆ శాఖను కోరింది. కొద్ది రోజుల క్రితం పిఎంఓ ఆమోదం కోసం పంపించిన సీనియర్ సిటిజన్లకు సంబంధించిన ముసాయిదా విధానంపై పిఎంఓ కొన్ని ప్రశ్నలను లేవనెత్తినట్లు మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒకవేళ పిఎంఓ గనుక ముసాయిదా విధానానికి ఆమోదం తెలిపినట్లయితే ఇప్పుడున్న 1999నాటి వయో వృద్ధుల జాతీయ విధానం స్థానంలో దాన్ని ప్రవేశపెడతారు. వృద్ధుల ఆరోగ్యానికి సంబంధించిన వైద్య శాస్త్రం (గెరియాట్రిక్స్) విషయంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ చేసినట్లుగా వృద్ధులకు సంబంధించిన జాతీయ విధానం విషయంలో కూడా బయటి ఏజెన్సీతో అధ్యయనం జరిపించే ప్రయత్నం చేయాలని పిఎంఓ మంత్రిత్వ శాఖకు పంపిన ఒక లేఖలో కోరింది. అంతేకాకుండా దివ్యాంగుల సౌలభ్యానికి సంబంధించిన అంశాలను యాక్సెసిబిల్ ఇండియా ప్రచారం కింద ఎలా చేపట్టారో కూడా సంబంధిత విభాగంతో చర్చించాలని కూడా పిఎంఓ సూచించింది.