జాతీయ వార్తలు

బోగీ లేకుండానే ఆదోని చేరిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జనవరి 15: రైల్వే అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా నాందేడ్ నుంచి బెంగళూరు వెళ్తున్న 16593 నెంబర్ గల ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్-6 రిజర్వేషన్ బోగీ లేకుండానే ఆదివారం రాత్రి 8.33 గంటలకు ఆదోని రైల్వేస్టేషన్‌కు చేరింది. దీంతో ఆదోని రైల్వేస్టేషన్‌లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఎస్-6 రిజర్వేషన్ బోగీ లేకపోవడంతో ఆందోళన చెందారు. వెంటనే ఆదోని స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్‌ను సంప్రదించగా ఆయన తామేమీ చేయలేమని చెప్పడంతో ప్రయాణికులు రైలును నిలిపివేసి స్టేషన్ మేనేజర్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వీరికి తోడు ఎస్-6 బోగీలో రిజర్వేషన్ చేసుకున్న రాయచూర్, యాదగిరి ప్రయాణికులు కూడా కలిసి రైలును నిలిపివేసి స్టేషన్ మేనేజర్‌ను నిలదీశారు. దీంతో స్టేషన్ మేనేజర్ వెంటనే గుంతకల్లు రైల్వే అధికారులతో మాట్లాడగా గుంతకల్లులో ఎస్-6 బోగీని ఏర్పాటుచేస్తామని అక్కడి అధికారులు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని స్టేషన్ మేనేజర్ ప్రయాణికులకు చెప్పినా ఆందోళన విరమించలేదు. స్టేషన్ అధికారులు, పోలీసులు, ప్రయాణికుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరకు ఆదోని రెండవ పట్టణ సిఐ గంటా సుబ్బారావు రేల్వేస్టేషన్ చేరుకుని ప్రయాణికులకు సర్దిచెప్పారు. అలాగే స్టేషన్ మేనేజర్ వెంకటేసుతో మాట్లాడగా ఆదోని రైల్వేస్టేషన్‌లో బోగీలు ఉండవని, గుంతకల్లులో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారని ప్రయాణికులకు వివరించారు. చివరకు రైల్వేపోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికులను చెదరగొట్టి రైల్వేబోగీల్లోకి ఎక్కించి వారితో పాటు వెళ్లారు. ప్రయాణికుల ఆందోళనతో నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదోని స్టేషన్ నుంచి సుమారు ఒకటిన్నర గంట ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది.

చిత్రం..ఆదోని రైల్వేస్టేషన్ మేనేజర్‌తో వాగ్వాదానికి దిగిన ప్రయాణికులు