జాతీయ వార్తలు

ఏమిటీ నిర్లక్ష్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: 3సుప్రీం కోర్టు అనుకుంటున్నారా? లేక పరిహాసాల కోర్టుగా భావిస్తున్నారు. ఏమిటీ నిర్లక్ష్యం2 అంటూ రాష్ట్రాలపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నిప్పులు చెరిగింది. కాలుష్యం, మధ్యాహ్న భోజన పథకాల్లో పరిశుభ్రత లేకపోవడం వంటి ప్రజా ప్రాధాన్యతాంశాల విషయంలో రాష్ట్రాల నిర్లక్ష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాలపై ఎందుకు జావాబు ఇవ్వడంలేదంటూ నిలదీసింది. అసలు రాష్ట్రాల సుప్రీం కోర్టు ఆదేశాల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాయా? లేక దీన్నో పంచాయితీగా భావిస్తున్నాయా? అని కూడా కోర్టు ప్రశ్నించింది. లేనిపక్షంలో తమ ఆదేశాలను ఎందుకు పాటించటం లేదని, ఎందుకింత ఉదాశీనత అంటూ కనె్నర్ర చేసింది. ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను పిలిపిస్తే తప్ప కోర్టు ఆదేశాల ప్రాధాన్యత ఏమిటో కూడా తెలియదా? అంటూ ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖెహర్, న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ ప్రశ్నించింది. ఇంత కీలకమైన అంశానికి సంబంధించి ఎందుకు సకాలంలో ప్రతి స్పందించటం లేదు? కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయడం లేదంటూ న్యాయమూర్తులు గట్టిగానే అడిగారు. ఈ అంశాలకు సంబంధించి మొదట రెండు ప్రజాహిత పిటిషన్లను విచారణకు స్వీకరించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఓ ఆటగా భావిస్తే మీ ప్రకటనలను రికార్డు చేయాల్సి వస్తుంది అని రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న లాయర్లను ఉద్దేశించి బెంచ్ వ్యాఖ్యానించింది. సంబంధిత రాష్ట్రాలకు ప్రజాహిత పిటిషన్ల నోటీసులను పంపిన అంశాన్ని చేపట్టిన కోర్టు 3కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఎక్కువ గడువు కావాలంటే అందుకు అప్పీల్ చేసుకోండి. అంతేకాని, కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఉంటే మాత్రం తీవ్రమైన అంశంగానే పరిగణిస్తాం2 అని బెంచ్ సూచించింది. పారిశ్రామిక కాలుష్యానికి సంబంధించి గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న పర్యావరణ్ సురక్షా సమితి అనే ఎన్జీవో పిటిషన్‌ను కోర్టు ముందుగా చేపట్టింది. 2012లోనే ఈ పిటిషన్ దాఖలైంది. ఆ రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తులకు ఎన్నో అవకాశాలిచ్చినా చాలా రాష్ట్రాలు జవాబు ఇవ్వలేదన్న విషయం స్పష్టమైంది. తమిళనాడు, హర్యానా, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలు ఇంతవరకూ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయలేదని తెలిపింది. ఈ విషయంలో ఎందుకు జాప్యం జరిగిందంటూ ఆయా రాష్ట్రాల న్యాయవాదులను నిలదీసింది. తొలిసారిగా ఈ అంశంపై తమముందు హాజరైన రాష్ట్రాలకు నాలుగు వారాలు గడువిచ్చింది. అలాగే ఈ రాష్ట్రాల పర్యావరణ కార్యదర్శులకు సంబంధిత రికార్డులతో రావాలంటూ సమన్లు పంపింది. నాలుగు వారాల్లో ఈ అంశాన్ని పూర్తిగా పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. ఇక 2013లో దాఖలైన అంతర్రాష్ట్రీయ మానవ్ అధికార్ నిగారని అనే ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన రెండో పిటిషన్ విచారణ చేపట్టింది. ఇది మధ్యాహ్న భోజన పథకాల్లో పరిశ్రుభ్రత ఎక్కడా లేదంటూ దాఖలైన పిటిషన్. బీహార్‌లో కలుషిత ఆహారం తిని 23మంది పిల్లలు మరణించిన సంఘటనలు పునరావృతం కాకుండా మధ్యాహ్న భోజన పథకం విషయంలో అన్ని రాష్ట్రాలూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. అయితే, సంబంధిత న్యాయవాది ఢిల్లీలో లేనందున ఈ కేసును వాయిదా వేయాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థించటంతో సుప్రీం బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 3ఇది సుప్రీం కోర్టు అనుకుంటున్నారా? లేక పరిహాసాల కోర్టు అనుకుంటున్నారా?2 అంటూ గద్దించింది. ఇది చాలా కీలకమైన విషయమని పేర్కొన్న న్యాయమూర్తులు, అసలు ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది ఎవరంటూ ప్రశ్నించారు. అనంతరం విచారణను వాయిదా వేశారు.