జాతీయ వార్తలు

ఖాదీ కమిషన్‌పై పిఎంఓ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) రూపొందించిన క్యాలెండర్, డైరీలపై మహాత్మాగాంధీ బొమ్మను తొలగించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని ప్రచురించటంపై రేగిన వివాదంపై ప్రధాని కార్యాలయం సోమవారం స్పందించింది. పిఎంఓ అనుమతి తీసుకోకుండానే కెవిఐసి గాంధీజీ బొమ్మను తొలగించటం క్షమించరాని తప్పని పిఎంఓ అభిప్రాయపడింది. కెవిఐసి వార్షిక క్యాలెండర్‌లో తన చిత్రాన్ని వాడటం వల్ల మోదీ నిజంగా బాధపడ్డారని పిఎంఓ అధికారులు పేర్కొన్నారు. ఖాదీ క్యాలెండర్‌పై జాతిపిత చిత్రాన్ని తొలగించటం కచ్చితంగా తప్పేనని మోదీ అన్నట్లు వారు పేర్కొన్నారు. 2017 సంవత్సరం ఖారీ గ్రామీణ పరిశ్రమల క్యాలెండర్‌పై సంప్రదాయంగా వస్తున్న గాంధీజీ చిత్రానికి బదులుగా మోదీ చిత్రాన్ని ప్రచురించటంతో వివాదం మొదలైంది. మహాత్ముడి మనవడు తుషార్ గాంధీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లు సైతం అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ప్రధానమంత్రి పాలిస్టర్ డ్రస్‌లకు రోల్‌మోడల్, గాంధీజీ బకింగ్‌హమ్ ప్యాలెస్‌కు ఖద్దరు బట్టలు వేసుకుని వెళ్లారు. పది లక్షల విలువైన సూట్ వేసుకోలేదు’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ చేతిలో చర్ఖా, మనసులో నాథూరాం ఉన్నారని విమర్శించారు. ‘బాపూ, మీ చర్ఖాను దొంగ ఎత్తుకెళ్లాడు.. నా సందేశం ఈ చిట్టీద్వారా పంపుతున్నా వినండి బాపూ..’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. మొదట రూ.2000 నోట్లలో కొన్నింటిపై గాంధీ బొమ్మ లేకుండా చేశారని, ఇప్పుడు ఏకంగా కెవిఐసి ఆఫీసులోనుంచే తొలగించారని రాహుల్ ఎద్దేవా చేశారు.

చిత్రం..ఖాదీ బోర్డు రూపొంచిందిన క్యాలండర్‌లో మోదీ బొమ్మను చేర్చినందుకు నిరసనగా సోమవారం కోల్‌కతాలో నిర్వహించిన ఆందోళనలో ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ గోడపై మహాత్మా గాంధీ బొమ్మను అతికిస్తున్న ఓ యువజన కాంగ్రెస్ కార్యకర్త