జాతీయ వార్తలు

నేను ముందునుంచీ కాంగ్రెస్ వాదినే: సిద్ధూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: తాను జన్మతః కాంగ్రెస్‌వాదినంటూ మాజీ క్రికెటర్, బిజెపి మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధు అందరినీ ఆశ్చర్యపరిచారు. సిద్ధు సోమవారం ఏఐసిసి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ తాను అధికారికంగా కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రకటించారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. సోమవారం ఏఐసిసి అధికార ప్రతినిధి ఆజయ్ మాకెన్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. పంజాబ్ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సిద్ధు కాంగ్రెస్‌లో చేరటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్‌లో చేరటం అంటే సొంత ఇంటికి తిరిగిరావటమేనని ఆయన చెప్పుకొచ్చారు. కాగా సిద్ధును కాంగ్రెస్‌లో చేర్చుకొనడానికి పంజాబ్ పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే రాహుల్ గాంధీ పట్టుపట్టడంతో ఆయన చేరికను ఆమోదించారు. ఛలోక్తులకు, చతురోక్తులకు పేరుగాంచిన సిద్ధూ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ రెండు దేశాలు తమ మధ్య తలెత్తిన సమస్యలను చర్చలద్వారా పరిష్కరించుకోగలిగితే ఇద్దరు వ్యక్తులు తమ మధ్య సమస్యలను ఎందుకు పరిష్కరించుకోలేరు అని అడిగారు. శాసనసభ ఎన్నికలను ఆయన పంజాబీ ప్రజల ఆత్మగౌరవంకోసం జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. ఇది తన వ్యక్తిగత పోరాటం కాదని, మొత్తం పంజాబీ ప్రజల పోరాటమని, బాదల్ కుటుంబం నుండి విముక్తి కలిగించవలసి ఉందని ఆయన పేర్కొన్నారు.

చిత్రం..ఎఐసిసి కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడేందుకు వచ్చిన సిద్ధూకు స్వాగతం చెబుతున్న ఢిల్లీ పిసిసి అధ్యక్షుడు అజయ్ మాకెన్ తదితరులు