జాతీయ వార్తలు

వాట్సప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: సామాజిక మాద్యమాలైన వాట్సప్, ఫేస్‌బుక్‌లో ప్రైవసీకి సంబంధించిన కేసులో కేంద్ర ప్రభుత్వం, టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్)లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వాట్సప్, ఫేస్‌బుక్ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. వాట్సప్, ఫేస్‌బుక్‌లలో డేటా భద్రత లేకపోవడం, వినియోగదారుడికి సంబంధించి గోప్యత పాటించడం లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. చీఫ్ జస్టిస్ జెసి ఖేహర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో సహకరించాల్సిందిగా అటార్నీ జనరల్ ముకుల్ రొహత్గిని బెంచ్ ఆదేశించింది. కర్మనసింగ్, శ్రేయాసేథి అనే ఇద్దరు న్యాయశాస్త్ర విద్యార్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.