జాతీయ వార్తలు

దర్యాప్తు ఎంతవరకు వచ్చింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుకు సంబంధించిన దర్యాప్తు సమగ్ర నివేదికను అందించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. ఈ అల్లర్లపై కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలంటూ దాఖలైన పిటిషన్ సందర్భంగా ఈ ఆదేశాలు జారీచేసింది. న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఆర్.్భనుమతితో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 20కి వాయిదా వేసింది. ఇప్పటివరకు సిక్కు వ్యతిరేక అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ జరిపిన దర్యాప్తు స్థితిగతుల నివేదికను నాలుగు వారాల్లో తమకు తెలియజేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్‌ను ఆదేశించింది. ప్రస్తుత ‘సిట్’ పదవీకాలం కూడా వచ్చేనెల 17తో ముగుస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇప్పటివరకూ కూడా ఎవరిపైనా చార్జిషీట్లే దాఖలు కాలేదని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం తరఫున వాదించిన పింకీ ఆనంద్ ఇప్పటివరకు సిట్ దర్యాప్తులో ఎంతో పురోగతి సాధ్యమైందని, మొత్తం 218 కేసుల దర్యాప్తు వివిధ దశల్లో ఉందని స్పష్టం చేశారు. 22 కేసులకు సంబంధించి పునర్విచారణ జరపాలని కూడా ఆదేశించడం జరిగిందన్నారు.