జాతీయ వార్తలు

వీధి కుక్కలకూ జీవించే హక్కుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: ‘వీధి కుక్కలకూ జీవించే హక్కుంది’.. దేశవ్యాప్తంగా వీధి కుక్కలను పూర్తిగా నిర్మూలించాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించినప్పుడు తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఇది. వీధి కుక్కలను ఏరివేయడానికి అనుమతి ఉన్నప్పటికీ ఆ విషయంలో బ్యాలెన్స్, సరయిన పద్ధతి ఉండాలని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఆర్ బానుమతిలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కలను పూర్తిగా నిర్మూలించాలని ఒక పిటిషనర్ వాదించినప్పుడు, ‘వీధి కుక్కలను ఎవరు కూడా పూర్తిగా నాశనం చేయలేరు. వాటికి కూడా జీవించే హక్కు ఉంది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. అదనపుసొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవించారు. ముఖ్యంగా కేరళ, ముంబయిలలో వీధి కుక్కలు సమస్యగా మారడంతో వాటిని ఏరివేయాలంటూ వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన అంశాలపై దాఖలయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. కేరళలో వీధి కుక్కలు జనాలకు సమస్యగా మారాయని, అయితే అంతమాత్రాన వీధి కుక్కలను చంపడానికి వీలు లేదని విచారణ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. ‘కుక్క కాటు కారణంగా ఒక వ్యక్తి చనిపోయి ఉండవచ్చు. అది ఒక ప్రమాదం. అంతమాత్రాన అన్ని వీధికుక్కలను చంపేయమని మేము ఆదేశించలేము’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. కేరళ హైకోర్టు మాజీ జడ్జి శ్రీజగన్ నేతృత్వంలోని కమిటీకి కుక్క కాటుకు సంబంధించి 400కు పైగా ఫిర్యాదులు అందాయని, కమిటీ వాటిని అధ్యయనం చేస్తోందని ఒక పిటిషనర్ తరఫు న్యాయవాది బెంచ్‌కి తెలియజేశారు. కేరళలో వీధి కుక్కలు కరవడం వల్ల చిన్న పిల్లలతో పాటుగా జనం చనిపోయిన సంఘటనలపై దర్యాప్తు చేయడం కోసం సుప్రీంకోర్టు ఈ కమిటీని నియమించింది. కాగా కేసు తదుపరి విచారణను బెంచ్ మార్చి 1కి వాయిదా వేసింది.