జాతీయ వార్తలు

ఉగ్రవాదం వీడితేనే శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జనవరి 17: భారత దేశంతో చర్చలు జరపాలంటే ఉగ్రవాదానికి దూరం కావాలసిందేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం పంపించారు. నరేంద్ర మోదీ మంగళవారం ‘రైజీనా డైలాగ్’ రెండవ వార్షిక సదస్సులో మాట్లాడుతూ భారతీయుల సర్వతోముఖాభివృద్ధి కోసం దేశాన్ని పరుగులు పెట్టించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రోత్సాహాన్ని అందించడాన్ని మోదీ ఖండించారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు తాను లాహోర్‌కు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసిన మోదీ కేవలం ఒకరి ప్రయత్నం వల్లే శాంతియుత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండదన్నారు. రష్యా నుంచి స్వదేశానికి తిరిగి వస్తూ అకస్మాత్తుగా లాహోర్‌లో దిగిన మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. భారత దేశం అభివృద్ధి చెందటం ప్రపంచానికి అవసరమని పేర్కొన్న మోదీ అదే విధంగా ప్రపంచ దేశాల్నీ అభివృద్ధి చెందడమూ భారత్‌కు ఎంతో అవసరమని ఈ సదస్సులో స్పష్టం చేశారు. రాజ్యేతర శక్తులకు పొరుగు దేశం ఇస్తున్న మద్దతు కారణంగా భారత్ అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ పాక్‌పై ధ్వజమెత్తారు. భారత్‌ను ఆసియాలో ఏకాకిని చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను గట్టిగా ఎదుర్కోవలసి ఉందంటూ చైనా, పాకిస్తాన్‌లపై పరోక్ష విమర్శలు చేశారు. ఆసియాలోని దేశాలన్నీ కలిసికట్టుగా వ్యవహరించాలి తప్ప ఒకరినొకరు ఏకాకులను చేసేందుకు ప్రయత్నించటం మంచిది కాదన్నారు. దేశ పౌరుల భద్రత కోసం తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.స్వీయ ప్రయోజనాల కోసమే పని చేయటం తమ విధానం కాదని, భారత్ అందరి సంక్షేమాన్ని కోరుకుంటుందని మోదీ ఉద్ఘాటించారు. భారత, చైనా లాంటి పెద్ద దేశాల మధ్య కొన్ని విభేదాలు ఉండటం అత్యంత సహమని పేర్కొన్న మోదీ చర్చల ద్వారానే వీటిని పరిష్కరించుకోవాలని హితవుచెప్పారు. ఇరు పక్షాలు బాధ్యతతో వ్యవహరించినప్పుడే శాంతి నెలకొంటుందని పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌తో టెలిఫోన్‌లో మాట్లాడినప్పుడు ఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించినట్లు మోదీ గుర్తు చేశారు. భారత్‌కు రష్యా మంచి మిత్ర దేశామని ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ అంశాల చర్చావేదికగా మూడు రోజుల పాటు జరిగే రైజీనా డైలాగ్ సదస్సుకు 65దేశాల నుంచి 250మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.