జాతీయ వార్తలు

అఖిలేశ్‌తో పొత్తుకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో ఎన్నికల పొత్తుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అఖిలేశ్ యాదవ్ వర్గానికే సైకిల్ గుర్తు లభించటంతో సమాజ్‌వాదీతో పొత్తుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఈ మేరకు ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఆజాద్ ఈ ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన పక్కన యుపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ ఉండటం గమనార్హం. కాంగ్రెస్, సమాజ్‌వాదీ మధ్య సీట్ల సర్దుబాటుకు వీలు కలిగించేందుకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం నుండి తప్పుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రకటించారు. అఖిలేశ్ నాయకత్వంలో పని చేసేందుకు కాంగ్రెస్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని ఆజాద్ చెప్పటంతో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు మార్గం సుగమమైంది.
అఖిలేశ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుకు అఖిలేశ్ భార్య, లోక్‌సభ సభ్యురాలు డింపుల్ యాదవ్, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. వీరివురు పది రోజులుగా తెరవెనక చర్చలు జరిపారు. చర్చలకోసం డింపుల్ ఢిల్లీకి వస్తే, ప్రియాంక పలుమార్లు లక్నోకు వెళ్లినట్లు తెలుస్తోంది. 403 సీట్లున్న రాష్ట్ర శాసనసభకు ఏడు దశల్లో జరిగే ఎన్నికల్లో చతుర్ముఖ పోటీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పోటీచేయటం ఉత్తమమని అఖిలేశ్ యాదవ్ భావిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకుంటే కాంగ్రెస్ లాభపడుతుందని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం నమ్ముతున్నారు. అయితే ఎస్పీతో కలిసి పోటీచేస్తే పార్టీ మనుగడకే ప్రమాదం వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొందరు అనుమానిస్తున్నారు. రాహుల్ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా అఖిలేశ్‌తో సీట్ల సర్దుబాటుకు సిద్ధమైపోయారు. వంద సీట్లు కేటాయించాలని మొదట డిమాండ్ చేసిన కాంగ్రెస్, ఇప్పుడు ఎనభై సీట్లు, ఉపముఖ్యమంత్రి పదవి కేటాయిస్తే సర్దుబాటుకు సిద్ధమేనన్న సంకేతాలిచ్చారు. కాంగ్రెస్‌తో కలిసి పోటీచేస్తే ముస్లింలు తమకే ఓటేస్తారని అఖిలేశ్ భావిస్తున్నారు. యాదవ యువత అఖిలేశ్‌కే మద్దతు ఇస్తున్నారు. యాదవుల మద్దతుకు ముస్లింల బలం తోడైతే రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావచ్చునని అఖిలేశ్ భావిస్తున్నారు. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్, బాబాయి శివపాల్ యాదవ్, అమర్‌సింగ్‌లతో రాజకీయంగా పోరాడి విజయం సాధించిన అఖిలేశ్‌కు రాష్ట్రంలో మద్దతు బాగాపెరిగింది. యువ నాయకుడు, అవినీతికి దూరంగా ఉంటూ అభివృద్ధికి పెద్దపీట వేసే నాయకుడుగా ముద్ర పడిన అఖిలేశ్ యాదవ్-ముస్లిం వ్యూహంతో అధికారంలోకి రాగలుగుతాడని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపిణీపై తెరవెనక చర్చలు ప్రారంభమైనట్లు తెలిసింది. ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేయాలి, ఏయే సీట్లలో పోటీచేయాలనేది కూడా రేపో మాపో ప్రకటించే అవకాశాలున్నాయి.