జాతీయ వార్తలు

సిబిఐ డైరెక్టర్‌గా అలోక్ కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మను సిబి ఐ కొత్త డైరెక్టర్‌గా నియమిస్తూ గురువారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె ఎస్ ఖెహర్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గేలతో కూడిన త్రిసభ్య కమిటీ అలోక్ కుమార్ పేరును ఆమోదించింది. డిసెంబర్ 2న అనిల్ సిన్హా రిటైర్ కావటంతో అప్పటి నుంచి సిబి ఐ డైరెక్టర్ పదవి ఖాళీగా ఉంది. గుజరాత్ కేడర్‌కు చెందిన రాకేశ్ ఆస్థానా ప్రస్తుతం తాత్కాలిక డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అలోక్ కుమార్ వర్మ 1979 బ్యాచ్, అరుణాచల్ ప్రదేశ్- గోవా-మిజోరాం కేడర్‌కు చెందిన ఐపి ఎస్ అధికారి. నిరుడు ఫిబ్రవరి 29నుంచి ఆయన ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.