జాతీయ వార్తలు

హామీలను గాలికొదిలేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘునాథ్‌గంజ్ (పశ్చిమ బెంగాల్), ఏప్రిల్ 18: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతలు ప్రజలకు బోలెడు హామీలు ఇచ్చారని, కాని వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్‌లో శారద చిట్‌ఫండ్ కుంభకోణం, తృణమూల్ కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా జరిగిన నారద స్టింగ్ ఆపరేషన్ వంటివి రాష్ట్రంలో అవినీతి పాలనకు అద్దం పడుతున్నాయంటూ ఆయన మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘రాష్ట్రంలో అవినీతిని తుడిచిపెడతానని మమతాజీ హామీ ఇచ్చారు. కాని ఆమె ముందే అవినీతి జరిగినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదు’ అని రాహుల్ గాంధీ ముర్షీదాబాద్ జిల్లా రఘునాథ్‌గంజ్, కాండీలలో జరిగిన ఎన్నికల సభల్లో మాట్లాడుతూ అన్నారు. నిజానికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ శారద చిట్‌ఫండ్ కుంభకోణం మొదలుకొని నారద స్టింగ్ ఆపరేషన్ వరకు అనేక అవినీతి కార్యకలాపాల్లో కూరుకుపోయిందని ఆయన విరుచుకుపడ్డారు.
నారద స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కుకున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై మమతా బెనర్జీ ఇప్పటివరకు చర్య తీసుకోలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో చర్య తీసుకుంటానని మమతా బెనర్జీ అంటున్నారని, కాని ఆమె ఇంతకుముందే ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన నిలదీశారు. మమతా బెనర్జీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనందువల్లనే ఈ ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ‘రాష్ట్రంలో మార్పు తీసుకొస్తానని, అభివృద్ధి సాధిస్తానని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని, శాంతిభద్రతలను మెరుగుపరుస్తానని మమతా బెనర్జీ హామీ ఇచ్చినందువల్లనే అయిదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది. కాని మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను మరచిపోయారు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామనే హామీతో ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఇచ్చారని గుర్తుచేస్తూ, ఆచరణలో యువతకు ఉద్యోగాలు వచ్చిన జాడే లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీలాగే మమతా బెనర్జీ కూడా రాష్ట్రంలో 70లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని, కాని, ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని రాహుల్ విమర్శించారు. ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? అని ఆయన సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు. మోదీ, మమతలు రైతాంగానికి కూడా చేసిందేమీ లేదని రాహుల్ ధ్వజమెత్తారు.