జాతీయ వార్తలు

హల్వా ఉత్సవంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: రానున్న ఆర్థిక సంవత్సరానికి (2017-18) సంబంధించి త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ఆ శాఖకు చెందిన ఇతర ఉద్యోగులు గురువారం ‘హల్వా ఉత్సవం’లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. హల్వా ఉత్సవం ముగిసిన తర్వాత పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకూ ఆ శాఖకు చెందిన 100 మందికి పైగా ఉద్యోగులు బాహ్య ప్రపంచానికి దూరంగా బడ్జెట్ ముద్రణాలయంలోనే ఉండాల్సి ఉంటుంది.
ఈ సమయంలో ఫోను ద్వారా గానీ, ఇ-మెయిల్ ద్వారా గానీ, మరే ఇతర మార్గాల ద్వారా గానీ కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా వీరిని అనుమతించరు. ఆర్థిక శాఖలోని ఎంతో సీనియర్ అధికారులను మాత్రమే ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తారు. బడ్జెట్ పత్రాల ముద్రణను హల్వా ఉత్సవంతో ప్రారంభించడం సాంప్రదాయంగా కొనసాగుతున్న విషయం విదితమే. ఈ ఉత్సవంలో భాగంగా పెద్ద కడాయి (బాణాలి)లో హల్వా తయారుచేసి, దానిని ఆర్థిక శాఖలోని ఉద్యోగులందరికీ వడ్డిస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా, రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌తో పాటు సార్వత్రిక బడ్జెట్ రూపకల్పనతో సంబంధమున్న ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం..హల్వా ఉత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ