జాతీయ వార్తలు

నిజాముద్దీన్, కొచువెలి మధ్య 42 ఏసి సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని హజ్రత్ నిజాముద్దీన్-కొచువెలి మధ్య 42 ఏసి సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ట్రైన్ నెం. 04426 హజ్రత్ నిజాముద్దీన్-కొచువెలి సూపర్‌ఫాస్ట్ ఏసి ప్రత్యేక రైలు ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీలలో, మార్చి 4, 11, 18, 25 తేదీలలో అదేవిధంగా ఏప్రిల్ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27 తేదీలలో, జూన్ 3, 10, 17, 24 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని జిఎం తెలిపారు. ఈ రైళ్లు ఉదయం గం. 05:55లకు బయలుదేరి, మరుసటి రోజు గం.11:00లకు గమ్యస్థానానికి చేరుకుంటాయి. కాగా మథుర, ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, నాగపూర్, బల్లార్షా, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కట్‌పడి, జోరాల్‌పెట్టాయ్, సేలం, ఏరోడ్, త్రిపుర, కోయంబత్తూర్, పాల్గట్, త్రిసూర్, ఆలువ, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగన్నూర్, కాయాంకులం స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.