జాతీయ వార్తలు

గిలానీ అకౌంట్లపై ఎన్‌ఐఏ నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: కాశ్మీర్ వేర్పాటువాది, హురియత్ నేత సయ్యద్ అలి షా గిలానీకి సంబంధించిన ఐదు బ్యాంకు అకౌంట్ ఖాతాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పరిశీలిస్తోంది. వీటిలో రెండు గిలానీ వ్యక్తిగత ఖాతాలు కాగా, మిగిలిన మూడు ఖాతాలు ఇతరులతో సంబంధాలు కలిగివున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. 2014-15లో ఈ ఖాతాల్లో జరిగిన లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన పెద్దమొత్తాలు గిలానీ ఖాతాలో జమ అయినట్లు, ఈ డబ్బును కాశ్మీర్‌లో జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు.