జాతీయ వార్తలు

డ్రగ్ కేసు తిరగదోడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, జనవరి 19: రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర మంత్రి బిక్రమ్ సింగ్ మఝితియాకు సిట్ క్లీన్‌చిట్ ఇచ్చిన డ్రగ్ రాకెట్ కేసు పునర్విచారణకు ఆదేశిస్తామని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ప్రకటించారు. సిద్దూ ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరారని, పార్టీకోసం ప్రచారం చేస్తారని చెప్పారు. మీరు ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ విషయంలో మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది కదా? అని అడగ్గా, ‘ముఖ్యమంత్రిని నేను కొట్టాలని మీడియా కోరుకుంటోందా’ అని అమరీందర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని చిత్తుగా ఓడించడం కోసమే తాను లంబి అసెంబ్లీ స్థానంనుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్తూ, రాష్ట్రంలో ప్రజలు బాదల్ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. మఝా జిల్లాలోని మొత్తం 9 స్థానాల్లోను తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన చెప్పుకొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ శిరోమణి అకాలీదళ్‌కు గట్టి పోటీ ఇస్తుందా అని అడగ్గా, ఆ పార్టీయే గందరగోళంలో ఉందని, పంజాబ్‌తో దానికి సంబంధాలే లేవని అమరీందర్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన చాలామంది నేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని కూడా ఆయన చెప్పారు. కాగా, సిద్ద్భూర్య నవ్‌జ్యోత్ కౌర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానం కల్పిస్తామని తాను సిద్ధూకు వాగ్దానం చేసినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా అమరీందర్ చెప్పారు. టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌లో అసంతృప్తి గురించి అడగ్గా, దాన్ని అదుపు చేస్తామని చెప్పిన ఆయన దాని ప్రభావం పార్టీ విజయావకాశాలపై ఉండదన్న ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాను ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడనున్నట్లు వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేసిన సిద్ధూ ‘తండ్రి ఎప్పటికీ తండ్రే, కుమారుడు ఎప్పటికీ కుమారుడే’ అని అన్నారు. దీనిపై అమరీందర్ సింగ్ స్పందిస్తూ తాను సిద్ధూకు వికెట్ కీపర్‌లాంటి వాడినని చెప్పుకొచ్చారు. కాగా, లంబి నియోజకవర్గంలో బాదల్‌ను ఓడించడానికి అమరీందర్ తరఫున ప్రచారం చేస్తానని సిద్ధూ చెప్పారు.

చిత్రం.అమృత్‌సర్‌లో గురువారం సిద్ధూతో కలిసి విలేఖరులతో మాట్లాడుతున్న అమరీందర్ సింగ్