బిజినెస్

విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 18: మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) ప్రత్యేక కోర్టు సోమవారం విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. ప్రభుత్వరంగ బ్యాంక్ ఐడిబిఐ నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ద్వారా తీసుకున్న రూ. 900 కోట్లకుపైగా రుణాన్ని మాల్యా ఎగవేసేందుకు పాల్పడ్డారన్న కేసులో మనీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు చేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఐడిబిఐ రుణంలో రూ. 430 కోట్లతో మాల్యా విదేశాల్లో ఆస్తులు కొన్నారంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నిరుడు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇడి వాదిస్తోంది. అయితే మొత్తం 17 బ్యాంకులకు రూ. 9,000 కోట్లకుపైగా బకాయిపడి దేశం విడిచి పారిపోయిన మాల్యా.. ప్రస్తుతం లండన్‌లో ఉండగా, విచారణకు హాజరుకావాలంటూ ఇడి ఆయనకు మూడుసార్లు సమన్లు ఇచ్చింది. మార్చి 18, ఏప్రిల్ 2, ఏప్రిల్ 9న విచారణకు హాజరు కావాలని ఈ సమన్లలో కోరింది. అయితే వీటిని మాల్యా బేఖాతరు చేయడంతో నాన్ బెయిలబుల్ వారంట్ కోసం శుక్రవారం ఇడి కోర్టును ఆశ్రయించింది. దీనిపై శనివారం విచారణ జరిపిన కోర్టు సోమవారం వారంట్‌ను జారీ చేసింది. ఇడి ఆరోపణలను కింగ్‌ఫిషర్ సవాల్ చేయగా, దాన్ని ప్రత్యేక న్యాయమూర్తి పిఆర్ భవ్కే తోసిపుచ్చుతూ నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేశారు.