జాతీయ వార్తలు

మణిపూర్‌లో కాంగ్రెస్-బిజెపి నువ్వా..నేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పిఏ) తొలగించాలనే డిమాండ్‌తో దాదాపు పదహారేళ్లపాటు నిరాహారదీక్ష చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఇరోమ్ చాను షర్మిల ఎన్నికల బరిలోకి దిగటంతో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మార్చి నాలుగు, ఎనిమిది తేదీల్లో రెండు దఫాలుగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఓక్రామ్ ఇబోబిసింగ్‌పై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ పేరుతో పార్టీ పెట్టిన షర్మిల రాష్ట్రంలో అధికారంలోకి రావటంద్వారా ప్రజలకు సేవ చేస్తానని చెబుతున్నారు. అయితే పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బిజెపిల మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. 60 సీట్లున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి ఇబోబిసింగ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆరుగురు తిరుగుబాటు శాసనసభ్యుల మూలంగా కాంగ్రెస్ ఇబ్బందికి గురవుతోంది. అస్సాంలో అధికారాన్ని చేజిక్కించుకున్న బిజెపి ఇప్పుడు మణిపూర్‌లో విజయం సాధించటం ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో తన పట్టును మరింత పెంచుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ప్రధానంగా మూడు అంశాల ఆధారంగా ఓటు వేయనున్నారు. ఇన్నర్‌లైన్ పర్మిట్ విధానం, వివిధ గ్రూపులు చేస్తున్న స్థానిక లేదా ప్రాంతీయ ప్రతిపత్తి, షెడ్యూలు ట్రైబ్ అంశం, భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం తొలగింపు డిమాండ్‌తోపాటు కూకి తెగ చేస్తున్న ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ కూడా కీలకపాత్ర నిర్వహించనున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఆర్థిక దిగ్భందం మూలంగా ప్రజలు నానాకష్టాలు పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం కూడా కీలకమయ్యే అవకాశం ఉంది. మణిపూర్‌లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే అంశంపై మూడు సర్వేలు మూడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఓ స్థానిక సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 35, ఎన్‌సిపికి 10, ఏఐటిసికి 3, ఎల్‌జెపికి 2, మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (ఎంఎస్‌సిపి)కి 8, ఎన్‌పిఎఫ్‌కు 2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టుడే-యాక్సిస్ జరిపిన సర్వే అంచనాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. బిజెపికి 31-35, కాంగ్రెస్‌కు 19-24, ఎన్‌పిఎఫ్‌కు 3-5, ఇతరులకు రెండు నుండి నాలుగు సీట్లు లభిస్తాయి. ఇండియా టివి-సి ఓటర్ తాజాగా జరిపిన సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 19-23, ఎంపిపికి 14-18, బిజెపికి రెండు నుండి ఐదు సీట్లు, ఇతరులకు 18 నుండి ఇరవై రెండు సీట్లు లభిస్తాయని అంచనా వేశారు. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 42 సీట్లు గెలుచుకుంది. ఎన్‌సిపి ఒకటి, ఏఐటిసి 5, ఎల్‌జెపి 1, ఎంఎస్‌సిపి 5, ఎన్‌పిఎఫ్ 4 సీట్లు గెలుచుకోగా, బిజెపి ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అయితే 2015లో ఇద్దరు తృణమూల్ సభ్యులు పార్టీ ఫిరాయింపుల మూలంగా శాసనసభ సభ్యత్వం కోల్పోయారు. ఈ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్ర బిజెపి నాయకత్వం వీరిద్దరిని తమ పార్టీలో చేర్చుకుని ఎన్నికల బరిలోకి దింపి గెలిపించింది. దీనితో శాసనసభలో అడుగు పెట్టగిలిగిన బిజెపి ఇప్పుడు ఏకంగా మెజారిటీ సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావాలనే కలలు కంటోంది.

చిత్రాలు..ఓక్రామ్ ఇబోబిసింగ్, ఇరోమ్ చాను షర్మిల