జాతీయ వార్తలు

యూపీలో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటా( ఉత్తరప్రదేశ్), జనవరి 19: ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదంలో అభం శుభం తెలియని 12మంది చిన్నారులు చనిపోయారు. 35మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. అలియాగంజ్, పలియాలి రోడ్‌లో ఉదయం స్కూలు పిల్లల్ని తీసుకెళ్తున్న బస్సు పొగమంచులో ఎదురుగా ఉన్న ట్రక్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దట్టంగా పొగమంచు కమ్ముకుని ఉండటంతో శుక్రవారం వరకు పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించినప్పటికీ జె ఎస్ విద్యానికేతన్ స్కూల్ మాత్రం సెలవు ప్రకటించలేదు. పాఠశాలకు చెందిన బస్సు యథావిధిగా విద్యార్థులను తీసుకువస్తుండగా మృత్యువు ముంచుకొచ్చింది. ఈ ఘటనలో బస్ డ్రైవర్ కూడా చనిపోయాడు. జిల్లా కలెక్టర్ శంభునాథ్, ఇతర అధికారులు ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. సహాయ కార్యక్రమాలను చేపట్టారు. కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘించి పాఠశాలను తెరిచినందుకు యాజమాన్యంపైనా, ప్రిన్సిపల్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అటు ఫరూకాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్‌బస్ మరో వాహనాన్ని ఢీకొన్న ఘటనలో 9మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఎటా ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడ్డ విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గవర్నర్ రాంనాయక్, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.