జాతీయ వార్తలు

ఆర్డినెన్స్‌కు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: తమిళనాడును కుదిపేస్తున్న జల్లికట్టు సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకుంది. జల్లికట్టును చట్టబద్ధం చేసేందుకు ప్రభుత్వం జారీ చేసే ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ఆర్డినెన్స్ ముసాయిదా ప్రతిని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. ప్రస్తుతం బెంగాల్ పర్యటనలోవున్న ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం రాత్రికి దేశ రాజధాని చేరుకుంటారు. ప్రణబ్ ముఖర్జీ ముసాయిదా ఆర్డినెన్స్‌ను ఆమోదించి పంపగానే రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు దాన్ని జారీ చేస్తారు. శనివారం లేదా ఆదివారం సాయంత్రంలోగా ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర చట్టంపై తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తున్నందున దీనికి రాష్టప్రతి ఆమోదం అవసరం.

చిత్రం..జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలన్న డిమాండ్‌తో మెరీనా బీచ్‌లో ఆందోళనకు దిగిన తమిళ ప్రజలు