జాతీయ వార్తలు

ఆ కులాలను బిసి-ఎలో ఎందుకు చేర్చారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: ముదిరాజ్, ముత్తరాసి, తెనుగొల్లు, పూసల కులాలను బిసి(డి) నుంచి బిసి(ఎ) జాబితాలోకి చేర్చడంపై సుప్రీంకోర్టు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ బిసి కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఈ నాలుగు కులాలను బిసి(డి) నుంచి బిసి(ఎ) జాబితాలోకి చేరుస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొన్ని బిసి సంఘాలు ఉమ్మడి హైకోర్టు ఆశ్రయించాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ హైకోర్టు జీవోను కొట్టివేసింది. తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ నాలుగు కులాలతో పాటు, ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, ఉమ్మడి బిసి కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నాలుగు కులాలను బి(ఎ)లోకి చేర్చడంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సుప్రీం గతంలో ఆదేశించింది. పిటిషన్ అప్పటి నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే సుప్రీం కోర్టులో శుక్రవారం చీఫ్ జస్టిస్ జగదీష్ సింగ్ ఖెహర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. తెలంగాణ ప్రభుత్వ తరపున్యాయవాది వెంకటరెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని, బిసి కమిషన్‌ను ఇంప్లీడ్ చేయాలని, దీనిపై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు. తెలంగాణ బిసి కమిషన్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వాములను చేస్తూ మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని నోటీసులు జారీ చేసింది.