జాతీయ వార్తలు

ఏకాకి మనస్తత్వం వీడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: ప్రభుత్వ విభాగాలు ఏకాకి మనస్తత్వాన్ని విడనాడాలని, కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘దురదృష్టవశాత్తు ప్రభుత్వ విభాగాలు ఎవరికి వారుగా పని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నాయి. ఒక్కోసారి ఒకే విభాగంలో పలు ముఠాలు ఉంటాయి. శాఖల మధ్య సమన్వయం ఉండడం లేదు. అందువల్లనే ఏదయినా ఒక కార్యక్రమం గురించి ఒక విభాగం ఒక విధంగా ఆలోచిస్తే మరో విభాగం దానికి పూర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తోంది’ అని ప్రధాని అన్నారు. ఒక్కోసారి ఒకే ప్రభుత్వానికి చెందిన రెండు విభాగాలు వివాదాలను పరిష్కరించుకోవడానికి లాయర్లకు సొమ్ములిచ్చి కోర్టులో పోట్లాడుకుంటున్నాయి. ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. ఇది మారాల్సిన అవసరం ఉంది. దీనికి మార్గమేమిటింటే కలిసి కూర్చుని విశాల దృక్పథంతో లోతుగా చర్చించి, ఒక్కో విభాగం ఎలాంటి పాత్రను పోషించాలి, ఎలాంటి ఫలితాలు సాధించాలనే విషయం ఆలోచించాలి’ అని ఆయన అన్నారు. శుక్రవారం గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో జరుగుతున్న వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటకం, సాంస్కృతిక, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖల మంత్రులు, కార్యదర్శుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముఖ్యంగా మారుతున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న పని గురించి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని కూడా ఆయన అన్నారు.
ప్రతి ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహించాలని అనుకుంటున్నాయని, అందువల్ల యువత క్రీడల్లో రాణించేందుకు వీలుగా సంస్థాగత వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. టాలెంట్ ఎక్కడుంది, వౌలిక సదుపాయాలు ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవడానికి వీలుగా జిల్లా స్థాయిలో సరయిన మ్యాపింగ్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలోని అంతులేని టాలెంట్ ఉందని ఆయన అంటూ, దీన్ని సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. యువత స్వచ్ఛ్భారత్ మిషన్‌కు కూడా జవసత్వాలు అందించిందన్నారు. పర్యాటక రంగం గురించి మాట్లాడుతూ, ప్రపంచం స్ఫూర్తి పొందేంత శక్తి మన దేశానికి ఉందని, ప్రతి రాష్ట్రం కూడా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి వాటిని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించారు.