జాతీయ వార్తలు

నియమావళి ఉల్లంఘన కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ కొచ్చి, మార్చి 21: కేరళలో ఎన్నికల నియమావళి అమలులో ఉండగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 20 లక్షల కుటుంబాలకు ఏప్రిల్ ఒకటో తేదీనుంచి ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన మార్చి 4నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అవుతుందో, కాదో పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మొహంతి నేతృత్వంలోని కమిటీని కేరళ ప్రధాన ఎన్నికల అధికారి ఇ.కె.మాఝీ కోరారు. దారిద్య్ర రేఖకు దిగువన గల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ బడ్జెట్ ప్రసంగంలో భాగం. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ బియ్యం పంపిణీని ప్రారంభించడానికి రాష్ట్ర మంత్రివర్గం గత నెలలోనే ఆమోదం తెలిపింది.
ఉచిత బియ్యం పంపిణీ నిర్ణయాన్ని ఎన్నికల నియమావళి అమలులోకి రాకముందే తీసుకున్నప్పటికీ, అమలు మాత్రం ఎన్నికల సందర్భంగా చేస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు బియ్యం పంపిణీని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేదని కేరళ ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) కార్యాలయం తెలిపింది. అయితే బియ్యం పంపిణీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అవుతుందో, కాదో పరిశీలించాలని మొహంతి నేతృత్వంలోని కమిటీని కోరినట్లు వివరించింది. కేరళ అసెంబ్లీకి మే 16న ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఒకవేళ బియ్యం పంపిణీ అమలు ఆలస్యమైతే, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తుందని రాష్ట్ర ఆహార మంత్రి అనూప్ జాకబ్ ఒక వార్తాసంస్థకు చెప్పారు. ఇది ఎన్నికల నియమావళి అమలులోకి రాకముందు తీసుకున్న విధాన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.