జాతీయ వార్తలు

ఎడ్లబండ్ల పోటీలనూ అనుమతించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, జనవరి 22: తమిళనాడులో జల్లికట్టుకు అనుకూలంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్టల్రో ఎడ్లబండ్ల పందేలపైన నిషేధాన్ని ఎత్తివేయాలని పుణెకు చెందిన శివసేన ఎంపి శివాజీరావు అధల్‌రావు పాటిల్ డిమాండ్ చేశారు. తమిళనాడులో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా అందరూ జల్లికట్టుకు మద్దతుగా నిలిచారని, ముఖ్యమంత్రి ప్రధానిని సైతం కలిశారని ఆయన అంటూ తమిళనాడు సిఎంను స్ఫూర్తిగా తీసుకుని మహారాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ప్రధానిని కలిసి రాష్ట్రంలో ఎడ్లబండ్ల పోటీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరాలనేదే మా డిమాండ్ ఆయన అన్నారు. ఎడ్లబండ్ల పోటీలపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం చాకన్‌లో ఎడ్లబండ్ల యజమానులు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు ఆందోళన నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ‘దీనిపై న్యాయస్థానంలో న్యాయపోరాటం జరుగుతోంది.. అది తన పని తాను చేసుకుపోతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని రాష్ట్రంలో ఎడ్లబండ్ల పోటీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రధానిని కోరాల్సిన సమయం వచ్చింది’ అని పాటిల్ అన్నారు. జల్లికట్టు ఆర్డినెన్స్‌ను తాము సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని పుణెకు చెందిన జంతుప్రేమికులు చెప్పారు. జనం ఒత్తిడితో జారీచేసిన ఈ ఆర్డినెన్స్ న్యాయ వ్యవస్థను పూర్తిగా అవహేళన చేయడమేనంటూ సర్వజీవ మంగళ్ ప్రతిష్ఠాన్, పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.