జాతీయ వార్తలు

లాప్‌టాప్‌లు.. కన్యావిద్యాదానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 22: యువతకు లాప్‌టాప్‌లు, కనె్నపిల్లలకు విద్యాదానం, సమాజ్‌వాదీ పింఛన్ పథకం, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం రకరకాల పథకాలు, ఉచిత హామీలతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సమాజ్‌వాది పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లో గత అయిదేళ్లలో తాను చేసిన పనే మాట్లాడుతుందని ఆయన ప్రకటించారు. సమాజ్‌వాది పార్టీని స్థాపించి ఏకఛత్రాధిపత్యంగా నడిపించి, అధికారంలోకి తీసుకువచ్చి.. జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పిన ములాయంసింగ్ యాదవ్ అఖిలేశ్ ఆధిపత్యంతో ఒంటరిగా మిగిలిపోయారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల సమావేశానికి ములాయం గైర్హాజరయ్యారు. పార్టీలో సంక్షోభానికి కారణంగా భావిస్తున్న ములాయం సోదరుడు శివసాల్ యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి రాలేదు. రాష్ట్రంలో జనేశ్వర్ మిశ్రా ఆదర్శ గ్రామాలను అభివృద్ధి చేస్తామని అఖిలేశ్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మహిళలకు సాయం చేసేందుకు పోలీస్ హెల్ప్‌లైన్‌లను మెరుగుపరుస్తామన్నారు. ఈ ఎన్నికల మేనిఫెస్టో ప్రతి అభ్యర్థికి ప్రతిజ్ఞ లాంటిదని ఆయన అన్నారు. ప్రతి అభ్యర్థి తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి రోడ్ మ్యాప్‌ను రూపొందించాలన్నారు. 403 స్థానాల్లో తమ పార్టీ 300 స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని ఆయన అన్నారు. 32పేజీల మేనిఫెస్టోలో అఖిలేశ్, ములాయం చిత్రాలను ముద్రించారు. శివపాల్‌కు అసలు చోటే ఇవ్వలేదు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనటానికి సమాజ్‌వాదీ కిసాన్ కోష్ పేరుతో నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కోటి మంది ప్రజలకు నెలకు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో సమాజ్‌వాది పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో 24గంటలు విద్యుత్తు సరఫరా చేస్తామని కూడా హామీ ఇచ్చారు. 9-12 తరగతులు చదివే పిల్లలకు ఉచితంగా సైకిళ్లు, పేద మహిళలకు ఉచిత నెయ్యి, పాల పౌడర్, ఉచిత స్మార్ట్ఫోన్ పథకం, గర్భిణులకు పౌష్టికాహారం వంటి పథకాలను కుప్పలుతెప్పలుగా అఖిలేశ్ ప్రకటించారు.

చిత్రం..లక్నోలో ఆదివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్న యుపి సిఎం అఖిలేశ్ యాదవ్