జాతీయ వార్తలు

కూనేరు సంఘటనతో ఏడు రైళ్ళు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 22: ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరు డివిజన్ పరిధిలోకి వచ్చే కూనేరు రైల్వేస్టేషన్ సమీపాన హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన సంఘటనతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్ళు ఆదివారం రద్దయ్యాయి. ఏడు రైళ్ళు రద్దుకాగా, మరో ఏడు పాక్షికంగా రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. అలాగే ఇంకో పది రైళ్ళను దారి మళ్ళింపులో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సంఘటనతో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినందున ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రద్దయిన రైళ్ల వివరాలు
విశాఖపట్నం - రాయపూర్ (58528) పాసింజర్ ఆదివారం విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరాల్సి ఉంది. అలాగే రాయగడ-విశాఖపట్నం (58503) రాయగడ నుంచి, విశాఖపట్నం - కోరాపుట్ ఇ(58538) పాసింజర్ విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సి ఉంది. వీటితోపాటు సంబల్‌పూర్ - నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (18309) ఆదివారం సంబల్‌పూర్ నుంచి, విశాఖపట్నం-కోరాపుట్ పాసింజర్ (58504) విశాఖపట్నం నుంచి, జగదల్‌ర్-జన్‌గర్ రోడ్డు-్భవనేశ్వర్ హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18448/18438) ఆదివారం ఇక్కడ నుంచి బయలుదేరాల్సి ఉన్నాయి. విశాఖపట్నం - కోర్బా ఎక్స్‌ప్రెస్ (18518) విశాఖపట్నం నుంచి ఆదివారం బయలుదేరాల్సి ఉంది. అయితే కూనేరు రైల్వేస్టేషన్ వద్ద శనివారం అర్దరాత్రి సమయంలో జరిగిన సంఘటనతో ఇవన్నీ రద్దు చేసినట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.యల్వెందర్‌యాదవ్ తెలిపారు.
పాక్షికంగా రద్దు...
విజయవాడ-రాయగడ (57271)ల మధ్య నడిచే పాసింజర్ విశాఖపట్నం-విజయవాడ మధ్య నడుస్తుంది. దీనిని రాయగడ-విశాఖపట్నంల మద్య రద్దు చేశారు. విశాఖపట్నం-దుర్గ్ (58530)ల మధ్య నడిచే పాసింజర్ డొంకినవలస నుంచి నిర్వహిస్తున్నారు. దుర్గ్-విశాఖపట్నం (58529)ల పాసింజర్ టిట్లాఘర్ నుంచి దుర్గ్ వరకు నడుస్తుంది. కోర్బా-విశాఖపట్నం (18517) ఎక్స్‌ప్రెస్ రాయగడ వద్ద నిలిచిపోయింది. కోరాపుట్-విశాఖపట్నం (58537) పాసింజర్ రాయగడ నుంచి కోరాపుట్ వరకు నడుస్తుంది. భువనేశ్వర్-జగదపూర్-జునాగర్ రోడ్డు ఎక్స్‌ప్రెస్ (18447/18437) ను పాక్షికంగా రద్దు చేశారు. రాయ్‌పూర్-విశాఖపట్నం (58527) పాసింజర్ రాయపూర్ నుంచి నడవాల్సి ఉండగా, ఇది టిట్లాఘర్ వద్ద నిలిపివేశారు.
దారిమళ్ళింపులో మరికొన్ని...
ధన్‌బాద్ - అలెప్పీ ఎక్స్‌ప్రెస్ (13351) ధన్‌బాద్‌లో 21వ తేదీన బయలుదేరాల్సి ఉండగా దీనిని టిట్లాఘర్-రాయపూర్-నాగపూర్-బల్లార్సహలమీదుగా నడుపుతున్నారు. అలాగే హటియా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (18637) హటియా బయలుదేరే దీనిని కూడా టిట్లాఘర్, రాయపూర్, నాగపూర్, బల్లర్సహిల మీదుగా నిర్వహిస్తున్నారు. పూరి - అహమ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ (12843) 21వ తేదీన పూరిలో బయలుదేరాల్సి ఉండగా విశాఖపట్నం, విజయవాడ, నాగపూర్, అహ్మదాబాద్‌ల మీదుగా నడుస్తుంది. చెన్నై - అసన్‌సోల్ ఎక్స్‌ప్రెస్ (12375) ఎక్స్‌ప్రెస్ చెన్నైలో బయలుదేరాల్సి ఉండగా ఇది కూడా మళ్ళింపు మార్గంలో ఖుర్ధా, అంగూ, ఝార్సగూడల మీదుగా నడుస్తుంది. విశాఖపట్నం-హజరత్ నిజాముద్ధీన్ ఎక్స్‌ప్రెస్ (12807)ను దువ్వాడ, విజయవాడ, నాగపూర్‌ల మీదుగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ (22847) ఆదివారం విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరాల్సి ఉండగా, దీనిని దువ్వాడ నుంచి బయలుదేరిన విధంగా చర్యలు తీసుకున్నారు. నాందేడ్ - నాందేడ్ సంబద్ ఎక్స్‌ప్రెస్ (18310) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21వ తేదీన నాందేడ్‌లో బయలుదేరాల్సి ఉండగా ఖుర్ధా రోడ్డు, అంగూల్‌ల మీదుగా దీనిని నిర్వహిస్తున్నారు. హజరత్ నిజాముద్ధీన్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (12808) హజరత్ నిజాముద్ధీన్‌లో ఈనెల 21న బయలుదేరాల్సి ఉండగా ఇది నాగపూర్, విజజయవాడ, దువ్వాడల మీదుగా నడుస్తుంది.

చిత్రాలు..శనివారం అర్థరాత్రి 41 మందిని బలితీసుకున్న కూనేరు వద్ద హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద దృశ్యాలు