జాతీయ వార్తలు

పట్టాలు తప్పిన వాస్కోడిగామా ఇంజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 22: తిరుపతి నుంచి గోవాకు వెళ్లే వాస్కోడిగామా-గోవా ఎక్స్‌ప్రెస్ రైలింజన్ ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో తిరుపతి రైల్వేస్టేషన్ యార్డులో పట్టాలు తప్పింది. ఇంజన్‌కు సంబంధించిన మూడు చక్రాలు పట్టాలు తప్పాయి. యార్డ్ మేనేజర్ ఇచ్చిన సిగ్నల్స్‌ను ఇంజన్ డ్రైవర్ పట్టించుకోకుండా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. కాగా ఆ సమయంలో రైలు బోగీల్లో ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న రైల్వే మేనేజర్ సుబోద్‌మిత్ర సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి తక్షణం మరమ్మతు చర్యలు చేపట్టారు. అయితే రైలు ఇంజన్ పట్టాలు తప్పడానికి ఉన్న కారణాలపై విచారణ జరిపించాలని ఉన్నతాధికారులు తిరుపతి రైల్వే అధికారులను ఆదేశించారు. దీనిపై 24న విచారణ జరగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి-గోవా మధ్య గత నెల 29వ తేదీన కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు తిరుపతి నుంచి గోవాకు వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. శనివారం ఉదయం 5.30 గంటలకు వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ గోవా నుంచి తిరుపతికి చేరుకుంది. ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు ప్లాట్‌ఫాం నుంచి యార్డులోకి తీసుకెళ్లే సమయంలో ఇంజిన్ డ్రైవర్ యార్డ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా రావడంతో రైలింజిన్ మూడు చక్రాలు పట్టాలు తప్పాయి. ఈ సంఘటనపై రైల్వే సీనియర్ మేనేజర్ సుబోధ్‌మిత్ర తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ డ్రైవర్ అనాలోచిత విధానంతో ఈ ప్రమాదం జరిగిందని, అయితే ఇతర రైళ్ల రాకపోకలకు ఎలాంటి అవాంతరం ఏర్పడలేదన్నారు. రైల్వే ట్రాక్ కూడా దెబ్బతినలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఈనెల 24న విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు.