జాతీయ వార్తలు

జల్లికట్టు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 23: రాష్టవ్య్రాప్తంగా నిరాటంకంగా జల్లికట్టు నిర్వహణకు వీలుకల్పిస్తూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం సవవరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. 1960 నాటి జంతు హింస నిరోధక చట్టాన్ని సవరిస్తూ రెండు రోజుల క్రితం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానే ఈ బిల్లును ప్రవేశ పెట్టింది. సిఎం పనీర్‌సెల్వం ప్రవేశ పెట్టిన సవరణ బిల్లుకు అన్ని పార్టీల సభ్యులు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు. జల్లికట్టు నిర్వహణకు శాసన బద్ధత అవసరమని స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ జారీ అయిన జనవరి 21 నుంచే ఈ సవరణ బిల్లు అమలులోకి వచ్చినట్టుగా నిర్ణయించారు. జల్లికట్టుపై నిషేధాన్ని విధించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చైన్నైలోని మెరీనా బీచ్‌లో పోటెత్తిన నిరసనలను చల్లార్చేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. కాగా, కేవలం జల్లికట్టునే కాకుండా తమిళ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే మంజువిరాటు, వడమాడు, ఎరుదువిదుం ఉత్సవాలను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. జనవరి-మే మధ్యకాలంలో ఈ క్రీడలు రాష్ట్రంలో జరుగుతాయి. తమిళ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో జల్లికట్టు విశేషమైన భూమిక పోషిస్తోందని, అలాగే స్థానిక ప్రత్యేకత కలిగిన ఎద్దుజాతి సంతతిని పెంపొదించేందుకూ ఈ క్రీడను ప్రోత్సహించడం అవసరమని ఈ బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. దీని దృష్ట్యానే జల్లికట్టును జంతు హింస నిరోధక చట్టం పరిధి నుంచి మినహాయిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ సవరణ బిల్లును తీసుకురావడానికి దారితీసిన న్యాయపరమైన, వాస్తవ పరిస్థితుల నేపథ్యాన్ని ముఖ్యమంత్రి పనీర్‌సెల్వం తన ప్రసంగంలో వివరించారు.