జాతీయ వార్తలు

25మంది చిన్నారులకు సాహస పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: సాహసమనేది మానసిక స్థితేనని, ఆరోగ్యవంతమైన శరీరం ఇందుకు దోహదం చేసినప్పటికీ మనిషిని ప్రధానంగా ముందుకు నడిపే శక్తి మనసేనని, కనుక ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అత్యున్నత ధైర్య, సాహాసాలను ప్రదర్శించినందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన 25 మంది బాలలకు ప్రధాని సోమవారం జాతీయ సాహస పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోదీ వారితో ముచ్చటిస్తూ, మహా నాయకులు, క్రీడల్లో రాణించిన వారితో పాటు జీవితంలో గొప్ప పనులు చేసిన ఇతర ప్రముఖుల జీవిత విశేషాలను గురించి తెలుసుకోవాలని సూచించారు. ‘మీ సాహస కృత్యాలు మీ ధైర్యంతో పాటు నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మీ జీవితం ఇప్పుడే ప్రారంభమైంది. కనుక మీకు ఇవే చివరి అవార్డులు కాకూడదు. ఇప్పుడు లభిస్తున్న పొగడ్తలు, కీర్తిప్రతిష్టలతో మీరు సంతృప్తి చెందకూడదు. మున్ముందు ఇవి మీ భవిష్యత్తుకు అవరోధాలుగా పరిణమించకుండా చూసుకుని మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి’ అని మోదీ వారికి విజ్ఞప్తి చేశారు. అత్యంత ధైర్య, సాహసాలను ప్రదర్శించిన చిన్నారులను ప్రోత్సహించి వారిని ఇతర చిన్నారులు ఆదర్శంగా తీసుకునేలా చూసేందుకు భారత శిశు సంక్షేమ మండలి (ఐసిసిడబ్ల్యు) జాతీయ సాహస అవార్డుల పథకాన్ని ప్రారంభించింది.

చిత్రం..జాతీయ సాహస పురస్కారాలు అందుకున్న బాలలతో ప్రధాని నరేంద్ర మోదీ