జాతీయ వార్తలు

‘జల్లికట్టు’ ఆందోళన హింసాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 23: జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలన్న డిమాండ్‌తో వారం రోజులుగా సాగుతోన్న ఆందోళనలు సోమవారం హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఆర్డినెన్స్ జారీ అయిన నేపథ్యంలో ఆందోళనకారులను మెరీనా నుంచి ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించటం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీస్ చర్యను నిరసిస్తూ రెచ్చిపోయిన ఆందోళనకారులు ప్రతిఘటనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి, గుంపులను చెల్లాచెదురు చేసేందుకు బాష్పవాయు ప్రయోగానికి దిగారు. దీంతో మెరీనాలో వేలాదిగా గుమిగూడిన విద్యార్థులు, మద్దతుదారులు రెచ్చిపోయి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఐటి కారిడార్‌లోని ప్రధాన రహదార్లను దిగ్బంధించి, రోడ్లపై భైఠాయించారు. మెరీనాకు సమీపంలోని ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్, నడుకుప్పం ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పుపెట్టడంతో జల్లికట్టు నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఓకవైపు వందలాదిగా పోలీసులు, మరోవైపు వేలాది సంఖ్యలో విద్యార్థులు, మద్దతుదారులు మోహరించటంతో యుద్ధవాతావరణం కనిపించింది. దీంతో మెరీనా బీచ్, దాని పరిసరాలు అట్టుడికాయి. ఒకదశలో రెచ్చిపోయిన ఆందోళనకారులు ట్రిప్లికేన్, టేనంపేట్, కిల్పాక్, టి.నగర్ రహదారులను దిగ్బంధించారు. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నా సలై, జెమిని ఫ్లైఓవర్ ప్రాంతాలు ట్రాఫిక్‌తో స్తంభించాయి. ఉద్రిక్తతలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో పాఠశాలలను ముందుగానే మూసివేశారు. అనేక రూట్లలోని సిటీ బస్సులను ముందుజాగ్రత్త చర్యగా నిలిపేశారు. ఆందోళనకారులను మెరీనా నుంచి తరిమికొట్టినా, ఒక వర్గం మాత్రం పోలీస్ ఆదేశాలను బేఖాతరు చేసింది. పోలీసులు హెచ్చరికలు జారీ చేసేకొద్దీ మరింత పట్టు బిగించారు. పోలీసులు వెంటబడి తరిమినపుడు, తీరంలోపలికి దిగి ప్రతిఘటించారు. పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను ఖాళీ చేయించటంతో సోమవారం ఉదయం రాజాజీ సలై నుంచి కామరాజర్ సలై వరకూ కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. యుద్ధం ముగిసిన తరువాత రణరంగం మాదిరిగా మెరీనా పరిసరాలన్నీ విరిగిపడిన చెట్టుకొమ్మలు, ఆందోళనకారులు రువ్విన రాళ్లు, ఇటుకలతో భయానకంగా కనిపించింది. గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్ కాపీలను పోలీసులు పంచిపెట్టడంతో కొంతమంది ఆందోళనకారులు మెరీనా నుంచి వెళ్లిపోయారు. ఒకవర్గం మాత్రం మెరీనాలోనే తిష్టవేసి, ఆర్డినెన్స్‌పై అసెంబ్లీలో జరిగే పరిణామాలు చూసిన తరువాతే ఆందోళన విరమిస్తామని హెచ్చరించింది. ఏటా జల్లికట్టు నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపేవరకూ ఆందోళనలు విరమించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పోలీస్ చర్య ఫలితాలివ్వదు: కమల్
జల్లికట్టు ఆందోళనకారులపై పోలీస్ చర్యను నటుడు కమల్‌హాసన్, బాలాజీ తప్పుపట్టారు. ‘ఇది క్షమించరాని తప్పు. విద్యార్థులపై పోలీసుల దూకుడు ఎలాంటి మంచి ఫలితాలు ఇవ్వదు’ అని ట్వీట్లు చేశారు. విద్యార్థులు హింసాత్మక ఘటనలకు దిగకుండా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించడాన్ని సిపిఎం ఖండించింది. ‘సమస్య పరిష్కారానికి పోలీస్ చర్య మార్గం కాదు’ అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.

చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆందోళనకారుల ఆగ్రహానికి దగ్ధమైన కారు