జాతీయ వార్తలు

గైడెడ్ పినాకా రాకెట్ ప్రయోగం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలసోర్ (ఒడిశా), జనవరి 24: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన గైడెడ్ పినాకా రాకెట్ మార్క్-2 వెర్షన్‌ను మంగళవారం విజయవంతంగా ప్రయోగించి పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్‌రేంజి (ఐటిఆర్) మూడో కాంప్లెక్స్‌నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు పినాకా రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి పరీక్షించినట్లు ఐటిఆర్ డైరెక్టర్ బికె దాస్ చెప్పారు. పుణెకు చెందిన ఆర్మమెంట్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎఆర్‌డిఇ), హైదరాబాద్‌కు చెందిన రిసెర్చ్ సెంటర్ ఇమారత్, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) సంయుక్తంగా ఈ పినాకా రాకెట్‌ను అభివృద్ధి చేశాయి. సైనిక దళాల ఉప ప్రధానాధికారి లెఫ్టెనెంట్ జనరల్ సుబ్రతా సాహా, ఆర్టిలరీ డైరెక్టర్ జనరల్ లెఫ్టెనెంట్ జనరల్ పికె శ్రీవాస్తవ, ఎఆర్‌డిఇ డైరెక్టర్ కెఎం రాజన్, ఆర్‌సిఐ డైరెక్టర్ బిహెచ్‌విఎస్ నారాయణ మూర్తి, ఇతర ఉన్నతాధికారులు ఈ ప్రయోగాన్ని వీక్షించారు.
ఇంత తక్కువ సమయంలో గైడెడ్ పినాకా రాకెట్‌ను రూపొందించినందుకు ఆర్మీ, డిఆర్‌డిఓను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అభినందించారు. అన్‌గైడెడ్ వ్యవస్థలను కచ్చితమైన ఆయుధాలుగా అభివృద్ధి చేయడంలో దేశ సామర్థ్యానికి పినాకా ఒక నిదర్శనమని ఈ కార్యక్రమానికి హాజరైన రక్షణ మంత్రి శాస్ర్తియ సలహాదారు జి సతీష్ రెడ్డి అన్నారు. నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్ కిట్‌ను కూడా ఈ పినాకా రాకెట్‌లో ఏర్పాటు చేయడంవల్ల లక్ష్య ఛేదన శక్తి, కచ్చితత్వం కూడా పెరిగాయి. ఈ నెల 12న ఇదే వేదికనుంచి ఈ రాకెట్ తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు.

చిత్రం..దూసుకుపోతున్న పినాకా రాకెట్