జాతీయ వార్తలు

రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా అబుధాబీ యువరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి అబుధాబీ యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్‌యాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇక్కడ ఘన స్వాగతం పలికారు. యువరాజు రిపబ్లిక్ డే పరేడ్ వీక్షిస్తారు. యువరాజు యుఏఇ ఆర్మీ డిప్యూటీ సుప్రీం కమాండర్‌తో కలిసి యువరాజు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. భారత్‌లో ఆయన మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ప్రధాని మోదీతో మంగళవారం నహ్‌యాన్ ప్రాధమిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాలకు సంబంధించి 16 ఒప్పందాలు చేసుకుంటారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ హౌస్‌లో జరిగే డెలిగేట్ల స్థాయి సమావేశానికి ముందు ప్రధాని అధికార నివాసంలో వారు ఇరువురు ముఖాముఖి చర్చల్లో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్య, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, భద్రతకు సంబంధించి పలు ప్రధాన అంశాలపై మోదీ, అబుధాబీ యువరాజు చర్చలు జరుపుతారు.

చిత్రం..ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం అబుధాబీ యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్‌కు
స్వాగతం చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ