జాతీయ వార్తలు

మువ్వనె్నల రెపరెపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు రాష్ట్రాల రాజధానుల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. తమిళనాడు చరిత్రలో తొలిసారి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జెండా ఎగరేశారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి గవర్నర్ లేకపోవడంతో ఆయనే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు తమిళనాడుకు ఇన్‌చార్జి గవర్నర్‌గా కొనసాగుతున్నారు. అస్సాంలో రిపబ్లిక్ డేనాడు అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో పేలుళ్లు జరిగాయి. జాతీయ జెండా అవిష్కరించిన ముఖ్యమంత్రి సరబానంద సోనోవాల్ తీవ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండి అసాంఘిక శక్తులను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ త్రివర్ణపతాకాన్ని ఎగరేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రజలకు ఎంతో భరోసా ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం వర్షం పడడంతో చండీగఢ్, పాటియాల, జలంధర్, మొహాలీ, కురుక్షేత్ర, పంచకులోని రిపబ్లిక్‌డే వేదికలు తడిసి ముద్దయ్యాయి. మిజోరంలో జెండా ఆవిష్కరించిన లెఫ్టినెంట్ గవర్నర్ నిర్భయ్ శర్మ కొత్త భూ వినియోగ విధానాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ఆయనీ సందర్భంగా వెల్లడించారు. భ్రూణ హత్యలను నిరోధించేందుకు ఉద్దేశించిన ‘దులారీ కన్య’ పథకాన్ని అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ వి షణ్ముగనాథన్ ప్రకటించారు. ప్రభుత్వం ఆసుపత్రిలో ఆడపిల్లలు జన్మిస్తే వారిపేరున 20వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తారని జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. 2.5 లక్షల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు కల్పించనున్నట్టు కేరళ గవర్నర్ పి. సదాశివం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ జెండా ఆవిష్కరించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కర్నాటకలో స్మార్ట్ సిటీ మిషన్ కింద 2016-17 సంవత్సరానికి 776 కోట్లు విడుదల చేసినట్టు గవర్నర్ విజుభాయ్ వాలా ప్రకటించారు. బెంగళూరులో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. జమ్మూకాశ్మీర్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.
విదేశాల్లో జెండా ఆవిష్కరణ
బీజింగ్/కైరో: ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఆనందోత్సాహాల మధ్య 68వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చైనా రాజధాని బీజింగ్‌లో భారత ఎంబసీ వద్ద రాయబారి విజయ్ గోఖలే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగాన్ని ఆయన చదివి వినిపించారు. షాంగైలో ఇండియన్ కౌన్సిల్ జనరల్ ప్రకాశ్ గుప్తా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ నివసిస్తున్న భారతీయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుజో మెడికల్ కాలేజీలో చదువుతున్న భారతీయ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. నేపాల్ రాజధాని ఖాట్మండులోని భారత ఎంబసీ వద్ద రాయబారి అంజిత్ రే జెండా ఆవిష్కరించారు. ఈజిప్టులో నివసిస్తున్న ప్రవాస భారతీయులు, విద్యార్థులు గణతంత్ర దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈజిప్టులోని భారత రాయబారి కార్యాలయం వద్ద సంజయ్ భట్టాచార్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. సింగపూర్‌లో ఇండియన్ హై కమిషనర్ జావేద్ అష్రాఫ్ జెండా ఎగరేశారు. సన్‌టెక్ కనె్వన్షన్ సెంటర్‌లోని ప్రపంచలోనే అతిపెద్ద వీడియోవాల్‌పై రిపబ్లిక్‌డే గ్రీటింగ్స్ ప్రదర్శించారు.

చిత్రం..అజ్మీర్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అలరించిన చిన్నారులు