జాతీయ వార్తలు

ఇంతకంటే ఏం సాధించాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 26: ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ అవార్డును దక్కించుకోవడానికి ఇంతకంటే ఏం సాధించాలంటూ ప్రపంచ బిలియర్డ్స్, స్నూకర్ చాంపియన్ పంకజ్ అద్వానీ ఆవేదన వ్యక్తం చేశాడు. 16 పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకున్నానని, ఇంతకు మించి ఏం చేస్తే తనకు తగిన గుర్తింపు లభిస్తుందో అర్థం కావడం లేదని గురువారం ఒక ప్రకటనలో వాపోయాడు. గత ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది ప్రపంచ టైటిళ్లు సాధించిన విషయాన్ని అతను ఈ సందర్భంగా గుర్తు చేశాడు. అద్వానీ పేరును పద్మభూషణ్ అవార్డు కోసం కర్నాటక ప్రభుత్వంతోపాటు, భారత బిలియర్డ్స్ అండ్ స్నూకర్ సమాఖ్య (బిఎస్‌ఎఫ్‌ఐ) కూడా ప్రతిపాదించింది. అయితే, అవార్డుల కమిటీ ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించలేదు. 2009లో పద్మశ్రీ అవార్డును స్వీకరించిన అద్వానీ, ఆతర్వాత ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకున్నప్పటికీ, అతనికి తగినంత గుర్తింపును ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.

చిత్రం..పంకజ్ అద్వానీ