జాతీయ వార్తలు
ఫిబ్రవరిలో 103 ఉపగ్రహాల ప్రయోగం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 26: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని ఇస్రో అంతరిక్ష పరిశోధన సంస్థ (షార్) నుంచి వచ్చే నెల 2వ వారంలో 103 ఉపగ్రహాల ప్రయోగం ఉంటుందని షార్ డైరెక్టర్ పి ఉన్హికృష్ణన్ పేర్కొన్నారు. గురువారం ఆయన షార్‌లోని కల్పన అంతరిక్ష నివాస్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ ఈ ఏడాది ఇస్రో అత్యంత కీలకమైన ప్రయోగం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పిఎస్‌ఎల్‌వి సి-37 వాహ క నౌక ద్వారా ఒకే పర్యాయం 103 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. దేశానికి చెందిన కార్టోశాట్- 2డితో సహా మరో రెండు చిన్న ఉపగ్రహాలు, విదేశాలకు చెందిన మరో వంద ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే షార్‌కు వంద విదేశీ ఉపగ్రహాలు చేరుకున్నాయన్నారు. ప్రధాన ఉపగ్రహ రూపకల్పన కూడా పూరె్తైందన్నారు. ఇది త్వరలోనే షార్‌కు రానుందన్నారు. అన్ని పనులు పూరె్తైతే ఫిబ్రవరి 15 తరువాత ప్రయోగం ఉంటుందన్నారు. అంతేగాకుండా మార్చిలో జిఎస్‌ఎల్‌వి ఎఫ్09 రాకెట్ ద్వారా జిశాట్-9 ఉపగ్రహాన్ని పంపనున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌లో పిఎస్‌ఎల్‌వి సి-38 ప్రయోగం ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 ద్వారా జిశాట్-19 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. గత ఏడాది షార్ నుంచి అత్యధిక ప్రయోగాలు చేపట్టి అన్ని విజయవంతం చేశామన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ మైలురాయిని అధిగమించేందుకు శాస్తవ్రేత్తలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది తొమ్మిది ప్రయోగాలు చేపట్టగా, అన్నీ విజయవంతం చేసినట్లు చెప్పారు. జూన్ నెలనాటికి రెండో వాహన అనుసంధాన భవనం కూడా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో షార్ గ్రూప్ డైరెక్టర్ గోపి కృష్ణ, పబ్లిసిటీ అండ్ పబ్లికేషన్ అధికారి విశ్వనాధశర్మ, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్