జాతీయ వార్తలు

‘నేను భారతీయుడిని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: దాదాపు రెండు దశాబ్దాల క్రితం కృష్ణ జింకను హత్య చేసినందుకు ఆయుధ చట్టం కింద నమోదైన కేసు నుంచి గత వారం నిర్దోషిగా బయట పడిన బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (51) ఈ వేట కేసులో శుక్రవారం జోధ్‌పూర్‌లోని కోర్టుకు వాంగ్మూలాన్ని ఇచ్చాడు.
ఈ కేసులో సహ నిందితులైన బాలీవుడ్ నటులు నీల మ్, టబూ, సోనాలీ బింద్రే, సైఫ్ అలీ ఖాన్‌లతో కలసి ఉదయం 11 గంటల 20 నిమిషాలకు కోర్టుకు చేరుకున్న సల్మాన్ ఖాన్ దాదాపు గంటసేపు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ కేసులో సల్మాన్‌కు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ 65 ప్రశ్నలను సంధించగా, తాను నిరపరాధినని అతను చెప్పుకున్నాడు. నీవు ఏ మతస్తుడివి? అని న్యాయమూర్తి ప్రశ్నించగా, ‘నేను హిందువుని, ముస్లింని, రెండు మతాలకూ చెందివాడిని, అన్నింటికంటే ప్రధానంగా నేను భారతీయుడిని’ అని సల్మాన్ చెప్పాడు. కాగా, సల్మాన్ నేరానికి పాల్పడలేదని, సినిమా షూటింగ్ తర్వాత అతను హోటల్‌లోనే ఉన్నప్పటికీ ఈ కేసులో ఇరికించారని, సల్మాన్ అమాయకుడన్న విషయాన్ని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను తదుపరి విచారణ సందర్భంగా కోర్టుకు సమర్పిస్తామని అతని తరఫు న్యాయవాది హెచ్‌ఎం.సారస్వత్ తెలిపారు.

చిత్రం..శుక్రవారం జోధ్‌పూర్ కోర్టుకు హాజరై బయటకు వస్తున్న సల్మాన్‌ఖాన్