జాతీయ వార్తలు

ప్రచార బరిలోకి ప్రియాంక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకు ప్రియాంక గాంధీ స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టనున్నారు. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు విషయంలో ప్రధాన పాత్ర వహించిన ప్రియాంక ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. అనారోగ్యం కారణంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం చేయకపోవచ్చు. ఆ లోటు తీర్చేందుకు ప్రియాంక రంగ ప్రవేశం చేయనున్నారు. రాహుల్‌కు తోడుగా ప్రియాంక ప్రచారంలో పాల్గొంటే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ నాయకులు విశ్వసిస్తున్నారు. ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్‌లో మంచి జనాకర్షణ ఉన్నది, అవి ఓట్లుగా మారాలంటే ఆమె కేవలం అమేథీ, రాయబరేలీలకు పరిమితం కాకుండా రాష్టమ్రంతా తిరిగి ప్రచారం చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ ఆశించిన స్థాయిలో పార్టీకోసం ఎన్నికల ప్రచారం చేసే అవకాశాలు లేనందున అఖిలేశ్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ తరపున ప్రధాన ప్రచారకులుగా మారారు. ఒకవైపు అఖిలేశ్, రాహల్ మరోవైపు డింపుల్, ప్రియాంక ప్రచారం చేసేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే డింపుల్, ప్రియాంక సంయుక్తంగా ఎన్నికల ప్రచారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు చెబుతున్నారు.
అమేథీ, రాయబరేలీ సీట్లపై చర్చలు
ఆమేథీ, రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కేటాయింపుపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య వివాదం తెలెత్తింది. ఈ వివాదాన్ని పరిష్కరించి ఈ నియోజకవర్గాల పరిధిలోని మెజారిటీ సీట్లను కాంగ్రెస్‌కు ఇప్పించుకునేందుకు ప్రియాంక చర్చలు జరుపుతున్నారు. ఆమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో తిలోలి, సలోన్, జగదీష్‌పూర్, గౌరిగంజ్, అమేథీ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో బచ్రావన్, హర్చంద్‌పూర్, రాయబరేలీ, సరేనీ, ఉంచాహార్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో పది అసెంబ్లీ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే సమాజ్‌వాదీ పార్టీ నాయకులు మాత్రం 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమేథీ, రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గాల్లోని పది శాసనసభ స్థానాల్లో కేవలం మూడింటిలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఈ మూడింటిని మాత్రమే కాంగ్రెస్‌కు కేటాయిస్తామని సమాజ్‌వాదీ స్పష్టం చేసింది. తమ అభ్యర్థులు విజయం సాధించిన అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్‌కు ఎలా వదిలివేస్తామని సమాజ్‌వాదీ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రియాంక తన ప్రత్యేక దూతను అఖిలేశ్ యాదవ్ వద్దకు పంపించినట్లు తెలిసింది.