జాతీయ వార్తలు

అభివృద్ధిలో పోటీపడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, జనవరి 28: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర బడ్జెట్‌ను ముందుకు జరపడం, ఎన్నికల తేదీలు లాంటి చిన్న చిన్న విషయాలను లేవనెత్తడానికి బదులు అభివృద్ధి అంశంపై పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలను సవాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి సంపూర్ణ మెజారిటీ ఇచ్చినట్లయితే గోవాను దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని అన్నారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అయిదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పనాజిలో శనివారం జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘బడ్జెట్‌ను తయారు చేయడానికి ఆర్థిక మంత్రి చేసిన కృషికన్నా ఎక్కువగా ప్రతిపక్షాలు బడ్జెట్‌ను ముందుకు జరపడంపై విమర్శించడానికి వెచ్చిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో తమ ఓటమిని అవి అంగీకరించాయనడానికి ఇదే నిదర్శనం’ అని ఆయన అన్నారు. గోవా ఆర్థికాభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి టూరిజం అత్యంత కీలకమైందని, అందువల్ల రాష్ట్రం, కేంద్రం భుజం భుజం కలిపి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. గోవాలో వచ్చే నెల 14న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, ఒక రాజకీయ పార్టీ (ఆప్) మరో అడుగు ముందుకు వేసి ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు నిర్వహించేలా ప్రధాన మంత్రి కార్యాలయం ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చిందని ఆరోపిస్తోందన్నారు. వ్యవస్థను గౌరవించి, బలోపేతం చేయడానికి బదులు దాన్ని విమర్శించడమే గొప్పని కొంతమంది భావిస్తున్నారన్నారు. రాష్ట్రానికి ఎక్కువమంది పర్యాటకులు వచ్చేలా చూడాలని, తద్వారా రాష్ట్ర ప్రజలకు అత్యధిక ఆర్థిక ప్రయోజనం చేకూరేలా చేయాలని బిజెపి కోరుకుంటోందని ఆయన చెప్పారు. నోట్ల రద్దును విమర్శించిన వారంతా ఇప్పుడు నోరు మెదపడం లేదని ఆయన అన్నారు. కేంద్రంలోని గత యుపిఏ ప్రభుత్వం గోవాను పట్టించుకోలేదని విమర్శించారు. 50 ఏళ్లలో కేంద్రంనుంచి రాష్ట్రానికి ఎంత సాయం వచ్చిందో దానికన్నా ఎక్కువే తమ ప్రభుత్వం గత 25 నెలల్లో రాష్ట్రానికి ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ అస్థిరతే ఉండిందని కూడా ఆయన విమర్శించారు. సర్జికల్ దాడుల గురించి దేశమంతా గొప్పగా చెప్పుకొన్నారని, దేశానికి బలమైన రక్షణ మంత్రిని ఇచ్చిన ఘనత గోవాదేనని మనోహర్ పారికర్‌నుద్దేశించి ప్రధాని అన్నప్పుడు సభకు హాజరయిన జనం హర్షధ్వానాలు చేశారు.

చిత్రం..పనాజిలో శనివారం బిజెపి ఎన్నికల ర్యాలీలో ఓట్లకు అభివాదం చేస్తున్న మోదీ, పారికర్