జాతీయ వార్తలు

ఐకమత్యమే మన బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: ఐకమత్యం వల్లే భారత్ ఇంత పటిష్టంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఎన్‌సిసి కేడెట్ల ర్యాలీలో శనివారం ఆయన మాట్లాడుతూ మన ఐక్యమత్యమే దేశానికి బలం అని స్పష్టం చేశారు. ఎన్నో వైవిధ్యాలున్న భారత్ ధృడంగా ఉండడానికి ఎన్‌సిసి చేస్తున్న కృషి చిరస్మరణీయమని ఆయన అన్నారు. ‘్భరత్‌ను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. ఎన్నో ప్రాంతాలు, 100 భాషలు, 1500 మాండలికాలు, వివిధ ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఒకే తాటిపై నడవడం చూసి ప్రపంచం నివ్వెరపోతోంది’ అని మోదీ పేర్కొన్నారు. ఐకమత్యమే భారత్‌కు బలం అని ఆయన స్పష్టం చేశారు. రాజులు, రాజ్యాలు, ప్రభుత్వాలు ఒక జాతి కాదని పౌరులు, యువత, కర్షకులు, మేధావులు, శాస్తవ్రేత్తలు, కార్మికులు, ఆధ్యాత్మికవేత్తలు అందరూ కలిస్తేనే జాతి అని ప్రధాని అన్నారు. స్వచ్ఛ్భారత్‌కు ఎన్‌సిసి చేస్తున్న కృషిని మోదీ ప్రశంసించారు. నగదు రహిత లావాదేవీలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. భీమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని యువతకు విజ్ఞప్తి చేశారు. అంతే కాదు ఆ దిశగా ప్రజల్లో అవగాహనకు ఎన్‌సిసి కేడెట్లు కృషి చేయాలని అన్నారు. నోట్ల ముద్రణ ఖర్చుతో కూడుకున్నదని, అలాగే ఎటిఎంల నిర్వహణ కూడా అలాంటిదేదని, నగదు రవాణా వ్యయప్రయాసాలతో కూడుకున్నదేనని ప్రధాని తెలిపారు.

చిత్రం..ఢిల్లీలో శనివారం నిర్వహించిన ఎన్‌సిసి కేడెట్ల ర్యాలీని తిలకిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ