జాతీయ వార్తలు

విద్యార్థుల బ్యాగుల బరువు తగ్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: స్కూలు పిల్లల పుస్తకాల సంచుల బరువును తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న సిబిఎస్‌ఇ ఇందుకోసం పలు సిఫార్సులు కూడా చేసింది. సీనియర్ విద్యార్థులు భారీ రెఫరెన్స్ పుస్తకాలు తీసుకు రావడాన్ని టీచర్లు ప్రోత్సహించరాదని, అలాగే రెండో తరగతి దాకా పిల్లల పుస్తకాలు తరగతిలోనే ఉంచే విధానాన్ని పాఠశాలలు కొనసాగించాలనేవి ఈ సిఫార్సుల్లో ప్రధానమైనవి. సీనియర్ విద్యార్థులు టైమ్ టేబుల్ ప్రకారమే పుస్తకాలు తీసుకు వచ్చేలా టీచర్లు చూడాలని, అలాగే భారీ బరువుండే రెఫరెన్స్ పుస్తకాలు, ఇతర మెటీరియల్స్ స్కూలుకు తీసుకు రావడాన్ని ప్రోత్సహించవద్దని కూడా సిబిఎస్‌ఇ ఒక నోటిఫికేషన్‌లో సూచించింది. అంతేకాక స్కూలు పాఠ్య ప్రణాళిక అన్ని తరగతుల్లో అన్ని సబ్జెక్ట్‌లలో వీలయినంత వరకు కార్యకలాపాల ఆధారంగాను, అలాగే ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసిటి) ఆధారిత బోధనగానే ఉండాలని కూడా ఆ నోటిఫికేషన్‌లో సిఫార్సు చేసింది. పిల్లలపై భారం తగ్గించడానికి హోమ్ వర్క్ వీలయింత తక్కువగా ఉండేట్లు చూడాలని, విద్యా కోఆర్డినేటర్లు లేదా సూపర్వైజర్లు దీన్ని పర్యవేక్షించాలని కూడా సిబిఎస్‌ఇ సూచించింది. ప్రతిరోజూ పాట్య ప్రణాళికతో పాటుగా ఇతర అనుబంధ కార్యకలాపాలు కూడా నిర్వహించాలని, దానికి అనుగుణంగా టైమ్‌టేబుల్ ఉండాలని కూడా పేర్కొంది. అంతేకాక విద్యాసంవత్సరం పొడవునా స్కూలు బ్యాగ్ బరువు ఒకే విధంగా ఉండేలా చూడాలని, స్కూలుకు బరువైన బ్యాగులు తీసుకు రావడం వల్ల పిల్లల్లో ఎదుగుదలకు సంబంధించి వచ్చే సమస్యల గురించి పాఠశాల అధిపతులు తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ ఇవ్వాలని కూడా సిబిఎస్‌ఇ ఆ సిఫార్సుల్లో సూచించింది. పిల్లలు పుస్తకాలు, క్రీడా పరికరాలు, యూనిఫామ్‌లు లాంటివి స్కూలుకు మోసుకు రావలసిన అవసరం లేకుండా తరగతి గదుల్లోనే భద్రపరచుకోవడానికి వీలుగా అన్ని తరగతి గదుల్లో ర్యాక్స్ ఏర్పాటు చేయాలని, వాటికి తాళాలు కూడా ఉండాలని సిబిఎస్‌ఇ ఆ నోటిఫికేషన్‌లో సిఫార్సు చేసింది.