జాతీయ వార్తలు

‘పల్స్ పోలియో’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శనివారం రాష్టప్రతి భవన్‌లో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయిదు సంవత్సరాల లోపు వయసు గల కొంతమంది పిల్లలకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు. భారత్‌ను పోలియో రహిత దేశంగా కొనసాగించడానికిగాను ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 17 కోట్ల మందికి పైగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డేను పురస్కరించుకొని రాష్టప్రతి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రులు అనుప్రియ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌కు నేటికీ పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, నైజీరియాల నుంచి పోలియో వ్యాధి వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని మంత్రి నడ్డా హెచ్చరించారు.

చిత్రం..చిన్నారులకు చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న రాష్టప్రతి ప్రణబ్